Begin typing your search above and press return to search.

OG కోసం రంగంలోకి బడా ప్రొడ్యూసర్స్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ మేనియానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది.

By:  Madhu Reddy   |   24 Sept 2025 3:24 PM IST
OG కోసం రంగంలోకి బడా ప్రొడ్యూసర్స్!
X

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ మేనియానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ చూడడం కోసం చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము దులిపేస్తున్న ఓజీ మూవీ విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకుంది. భారీ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో అనగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇలాంటి సమయంలో ఎంతోమంది అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి మద్దతు తెలుపుతున్నారు.

ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఉండే ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ఓజీ మూవీకి సపోర్టుగా పెట్టిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఓజీకి మద్దతుగా ట్వీట్ లు పెట్టిన ఆ ప్రొడ్యూసర్లు ఎవరో కాదు ఒకరు దిల్ రాజు మరొకరు నాగ వంశీ.. నాగ వంశీ మెగా అభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. నాగవంశీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఆయన చాలాసార్లు బహిరంగంగానే బయటపెట్టారు. ఇక దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని చూపించాడు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి మద్దతు తెలుపుతూ నాగ వంశీ తన సోషల్ మీడియా ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

నాగ వంశీ ఓజీ మూవీలోని హుడి వేసుకుని "వారు అతన్ని ఓజి అని పిలుస్తారు. కానీ మేము అతన్ని మా పవర్ స్టార్ అని పిలుస్తాము.. పవన్ కళ్యాణ్ గారు ఆ ఓజీ ఫైర్ స్టోర్మ్ తో ఫైర్ ని తెరపైకి తీసుకురావడానికి వస్తున్నారు" అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ కి సినిమాల పరంగానే కాదు రాజకీయంగా కూడా.. జనసేన పార్టీకి నాగవంశీ గత ఎన్నికల్లో మద్దతు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.

నాగవంశీతో పాటు దిల్ రాజు కూడా తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ ఖాతాలో అఫీషియల్ గా ఓజీ మూవీకి మద్దతిస్తూ పోస్ట్ పెట్టారు. "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ప్రయాణంలో ఎల్లప్పుడూ తోడున్నారు. ఇన్ని సంవత్సరాలు మాకు ప్రేరణగా నిలిచారు. ఆయనతో కలిసి చేసిన ప్రతి సినిమా నిజంగా ఒక చిరస్మరణీయం. అలాగే మరోసారి ఆయనతో కలిసి ఓజీ మూవీ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది" అంటూ ట్వీట్ పెట్టారు.పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో డిస్ట్రిబ్యూట్ చేయగా.. నాగ వంశీ సీడెడ్ ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.