Begin typing your search above and press return to search.

ఓజీ, కాంతార వెయిటింగ్.. వాళ్లు ఏం చేస్తారో?

పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో బడా సినిమాలు రూపొందుతున్నాయి. శరవేగంగా షూటింగ్ లను కూడా జరుపుకుంటున్నాయి.

By:  M Prashanth   |   16 Sept 2025 12:37 PM IST
ఓజీ, కాంతార వెయిటింగ్.. వాళ్లు ఏం చేస్తారో?
X

పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో బడా సినిమాలు రూపొందుతున్నాయి. శరవేగంగా షూటింగ్ లను కూడా జరుపుకుంటున్నాయి. ఇప్పటికే అనేక చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ఖరారు చేసుకున్నాయి. మరికొన్ని రోజుల్లో పలు సినిమాలు ప్రేక్షకుల ముందు రానున్నాయి. అందులో ఓజీ, కాంతార చాప్టర్-1 సినిమాలు ఉన్నాయి.

ఆ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. అదే సమయంలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ మూవీ.. రిలీజ్ కు ముందే ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ, కాంతార ప్రీక్వెల్ భారీ స్థాయిలో రిలీజ్ కానుండగా.. ఇప్పుడు మేకర్స్ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల కోసం ఆయా సినిమాల మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పెంపుదల, ప్రత్యేక ప్రీమియర్ షోలు ఉండవని కొన్ని రోజుల క్రితం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అన్ని చిత్రాలకు ధరల పెంపుదల, ప్రత్యేక షోలు మంజూరు చేస్తోంది. ఇప్పుడు దసరా సెలవుల సీజన్‌ లో విడుదలయ్యే ఓజీ, కాంతార ఛాప్టర్-1కు కోసం అవసరమైన టికెట్ రేట్ పెంపుతో ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ నిర్ణయంపై అస్పష్టంగా ఉంది.

తెలంగాణ ప్రభుత్వం తమ చిత్రానికి మద్దతు ఇస్తుందని ఓజీ మేకర్స్ మాత్రం నమ్మకంగా ఉన్నారు. ఇటీవల టికెట్ రేట్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న వేళ.. కాంతార చాప్టర్ 1 మేకర్స్ ఆ రాష్ట్రంలో టికెట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే మిరాయ్, కిష్కింధపురి చిత్రాలు ఎటువంటి టికెట్ల పెంపు లేకుండా చాలా బాగా రాణిస్తున్నాయి. ధరల పెంపును ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేస్తున్నాయి. కానీ ఓజీ, కాంతార ప్రీక్వెల్ వంటి పెద్ద సినిమాలకు నిర్మాతలు టికెట్ల పెంపును పొందవలసి ఉంటుంది. కాగా.. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న విడుదల అవ్వనుంది. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.