ఇన్నాళ్లకు OG అప్డేట్.. అగ్ని తుఫానే!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 31 July 2025 11:13 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటన్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ మూవీపై ఫస్ట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో సినీ ప్రియుల్లో ఉన్న హైప్ భారీగా పెరిగింది.
ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో అయితే.. సినిమా హిట్ బొమ్మ అని అంతా ఫిక్స్ అయ్యారు. అంతలా బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ పొలిటికల్ బిజీ వల్ల మధ్యలో బ్రేక్ పడగా.. రీసెంట్ గా ఆయన మళ్లీ వరుసగా డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ ను ఇటీవల పూర్తి చేసేశారు మేకర్స్.
ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. దసరా కానుకగా సినిమాను తీసుకురానున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. టీజర్ వచ్చిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరో అప్డేట్ ఇవ్వనున్నారని టాక్ రాగా.. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
ఆగస్టు 2వ తేదీన మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు గురువారం అనౌన్స్ చేస్తూ పోస్టర్ షేర్ చేశారు. అందులో క్యాసెట్ పై ఫైర్ తుఫాను రాబోతుందని రాసి ఉండగా.. ఎరుపు రంగు పాము పాకుతున్నట్టు కనిపించింది. "అతను కోపంలో పుట్టి, పోరాటానికే కట్టబడ్డాడు. ఇప్పుడు చివరి పేజీ రాయడానికి తిరిగి వచ్చాడు. అగ్ని తుఫాన్ రాబోతుంది సిద్ధంగా ఉండండి" అంటూ రాసుకొచ్చారు మేకర్స్.
ఆ సాంగ్ చాలా రోజుల క్రితం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు మరికొన్ని గంటల్లో మేకర్స్ విడుదల చేయనున్నారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ కంపోజ్ చేసిన ఓజీ ఫస్ట్ సింగిల్ ను తమిళ స్టార్ శింబు పాడారు. ఆ సాంగ్ ను శింబు పాడారాని అప్డేట్ వచ్చినప్పుడే.. సినిమాపై ఉన్న హైప్ ఫుల్ గా పెరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ తో వచ్చిన హైప్ ను మరింత పెంచేలా తొలి పాట ఉంటుందని నెటిజన్లు, సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు.
కాగా.. సినిమా విషయానికొస్తే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఓజీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సిరి లెళ్ల, హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర పాత్రల్లో సందడి చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.
