Begin typing your search above and press return to search.

రికార్డ్ సృష్టించిన ఓజీ ఫైర్ స్టోర్మ్.. పవనా.. మజాకా!

ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఓజీ ఫైర్ స్టోర్మ్ సాంగ్ స్పాటిఫై లో రికార్డు సృష్టించింది.

By:  Madhu Reddy   |   7 Aug 2025 7:10 PM IST
రికార్డ్ సృష్టించిన ఓజీ ఫైర్ స్టోర్మ్.. పవనా.. మజాకా!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలవ్వడంతో ప్రస్తుతం అభిమానుల ఆశలన్నీ ఓజీ సినిమాపైనే ఉన్నాయి. సాహో మూవీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ నుంచీ వస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. పవన్ అభిమానుల ఆసక్తి మొత్తం ఓజీ సినిమా పైనే ఉండడం గమనార్హం. పైగా ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదలవుతుందా అని ఎంతో మంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఓజీ ఫైర్ స్టోర్మ్ సాంగ్ స్పాటిఫై లో రికార్డు సృష్టించింది. ఏకంగా స్పాటిఫై లో ఫైర్ స్టోర్మ్ అలాంటి రికార్డు క్రియేట్ చేయడంతో ఈ విషయాన్ని అభిమానులతో అఫీషియల్ గా పంచుకున్నారు సోనీ మ్యూజిక్ అధినేతలు. ఇక విషయంలోకి వెళ్తే.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచీ రీసెంట్ గా 'ఫైర్ స్టోర్మ్' అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ ఇప్పుడు స్పాటిఫై లో దుమ్ము రేపుతోంది. ఫైర్ స్టోర్మ్ సాంగ్ స్పాటిఫై లో ఊహించని రికార్డు క్రియేట్ చేసింది.

అదేంటంటే స్పాటిఫై లో అత్యంత వేగంగా 1 మిలియన్ కి చేరుకున్న పాటగా ఓజీ మూవీలోని ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టోర్మ్ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఓజీ మూవీ పైనే కాదు.. ఇందులో నుండి విడుదలయ్యే పాటలకు కూడా ఎలాంటి హైప్ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.అయితే

ఓజీ ఫైర్ స్టోర్మ్ సాంగ్ క్రియేట్ చేసిన ఈ రికార్డుని సోనీ మ్యూజిక్ అఫీషియల్ గా బయట పెట్టింది.ఇదిలా ఉండగా.. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ ఫైర్ స్టార్మ్ ని రిలీజ్ చేశాక కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కాపీ అంటూ కొన్ని కామెంట్లు వినిపించినప్పటికీ.. ఈ పాటకి మాత్రం మంచి ఆదరణ దక్కుతోంది.

ఈ విషయం పక్కన పెడితే ..పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రీసెంట్గా విడుదలై.. మొదటి రెండు రోజులు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఈ మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అలాగే ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో డిజాస్టర్ అయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరించారు. పలుమార్లు వాయిదా పడుతూ జూలై 24వ తేదీన విడుదలైంది.