'ఆ 2 పనులు చేయండి OG మేకర్స్'.. పవన్ ఫ్యాన్స్ పోస్టులు!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ మూవీపై ఆడియన్స్, ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే
By: M Prashanth | 4 Aug 2025 11:37 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ మూవీపై ఆడియన్స్, ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ హోప్స్ ఉన్నాయి. అప్పట్లో వరుస అప్డేట్స్ తో వాటిని పెంచిన మేకర్స్.. ఇప్పుడు మళ్లీ ఫైర్ స్మార్ట్ తో ఒక్కసారిగా సంచలనం సృష్టించారు.
ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటున్న ఫస్ట్ సింగిల్.. సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. 24 గంటల్లో అత్యధికంగా లైక్స్ పొందిన తెలుగు పాటగా రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అదే సమయంలో మేకర్స్ కు రెండు పనులు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు.
ఓజీ టీ షర్ట్స్, కీ చైన్స్, కాప్స్ సహా పలు వస్తువులను అధికారికంగా రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల విషయంలో అలా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓజీ మేకర్స్ అది ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల అటు అభిమానులు సాటిస్ఫై అవుతారు. ఇటు బజ్ కూడా ఇంకా పెరగనుంది.
భావోద్వేగపరంగా, వాణిజ్యపరంగా అర్థవంతమైన చర్య అని చెప్పాలి. మరోవైపు, ఫైర్ స్టార్మ్ సాంగ్ ను ప్రమోట్ చేయడానికి మేకర్స్ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో టై అప్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయంలో ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ను ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు.
అందులో కొందరు ఎవరికీ తెలియదని.. మరికొందరు ఇప్పటికే ట్రోలింగ్ ఎదుర్కొన్నారని అంటున్నారు. అలాంటి వాళ్లతో ప్రమోషన్స్ కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. సినిమా గొప్పతనానికి సరిపోయేలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ రెండు రిక్వెస్టుల విషయంలో మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుంది.
