OG ఫస్ట్ సాంగ్ రిలీజ్.. థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఓజీ నుంచి ఇవాళ సూపర్ అప్డేట్ వచ్చింది.
By: M Prashanth | 2 Aug 2025 4:16 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఓజీ నుంచి ఇవాళ సూపర్ అప్డేట్ వచ్చింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటను ఫైర్ స్ట్రోమ్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ లిరికల్ వీడియో యూట్యూబ్ లో సందండి చేస్తుంది.
ఈ పాటలో థమన్ ఎప్పట్నుంచో చెబుతున్నట్లుగానే మ్యూజిక్ ఇరగ్గొట్టారు. బాక్సులు బద్దలైపోయేలా మ్యూజిక్ ఇచ్చారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పనక్కర్లేదు. అది ఇంకో లెవెల్ లో ఉంది. ఫీల్ ది ఫైర్, ఓజాస్.. గంభీరా అంటూ సాగిన ఈ పాట సినిమాపై అంచనాలు ఇంకో స్థాయికి చేర్చింది. లిటరల్ గా ఈ పాట అభిమానులకే కాదు మ్యూజిక్ లవర్స్ కు కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఓవరాల్ గా ఈ ఫైర్ స్ట్రోమ్ లిరికల్ వీడియో నెక్ట్ల్ లెవెల్ లో ఉంది. థమన్ సంగీతం అందించగా.. విశ్వ, శ్రీనివాస మౌళి, రాజా కుమారి లిరిక్స్ అందించారు. థమన్తోపాటుగా నజీరుద్దీన్, శింబు, దీపక్ బ్లూ, భరతరాజ్ ఆ పాటను ఆలపించారు. ఫుల్ పవర్ ప్యాక్డ్ గా ఉన్న ఈ పాటకు థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సూపర్ మ్యూజిక్ అందిచిన థమన్ కు థాంక్స్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
మరోవైపు పాట రిలీజైన నిమిషాల్లోనే ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. యూట్యూబ్ లో అయితే టాప్ లో దూసుకుపోతోంది. గంటలో ఈ ఫైర్ స్ట్రోమ్ 8 లక్షల వ్యూస్ వచ్చాయి. 24 గంటల్లో మరిన్ని రికార్డులు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్క పాటకే ఇలా అయిపోతే, రేపు రేపు ట్రైలర్, సినిమా రిలీజ్ రోజు ఎలా ఉండనుందో అని ఫ్యాన్స్ ఇప్పట్నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.
కాగా, సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ముంబయి గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఇది తెరకెక్కింది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా.. శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజాస్ గంభీర థియేటర్లలోకి రానుంది.
