OG సుజిత్.. నెక్స్ట్ ఏంటి..?
కేవలం రెండంటే రెండే సినిమాల అనుభవం ఉన్న ఇతను పవర్ స్టార్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు
By: Ramesh Boddu | 15 Aug 2025 9:36 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. కేవలం రెండంటే రెండే సినిమాల అనుభవం ఉన్న ఇతను పవర్ స్టార్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓజీ సినిమా గ్లింప్స్ ఇంకా పవర్ స్టోర్మ్ సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. స్వతహాగా సుజిత్ పవర్ స్టార్ వీరాభిమాని. సో ఒక ఫ్యాన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో ఓజీ లో అలా చూపిస్తాడని తెలుస్తుంది. పవర్ స్టోర్మ్ సాంగ్ లో కొన్ని క్లిప్స్ అయితే అదిరిపోయాయి అనిపిస్తుంది.
నానితో సినిమా లాక్..
ఐతే ఓజీ కేసం దాదాపు రెండున్నర ఏళ్లుగా కష్టపడుతున్నాడు సుజిత్. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే ఈ సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ కుదరలేదు. ఫైనల్ గా ఓజీ రాబోతుంది. ఐతే ఈ సినిమా తర్వాత సుజిత్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఓజీ తర్వాత సుజిత్ ఆల్రెడీ నానితో ఒక సినిమా లాక్ చేసుకున్నాడు. ఓజీ నిర్మాత డివివి దానయ్యే ఆ సినిమాకు నిర్మాత.
నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుజిత్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఐతే ఓజీ తర్వాత వెంటనే నాని సినిమా ఉండకపోవచ్చని టాక్. ఇద్దరు మధ్యలో చెరో సినిమా చేస్తారని టాక్. నానితో కూడా సుజిత్ ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ అది కూడా లవ్ స్టోరీగా తీయాలని అనుకుంటున్నాడట. తప్పకుండా నాని సుజిత్ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.
పాన్ ఇండియా బొమ్మ..
నాని ప్యారడైజ్ 2026 మార్చి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సుజిత్ సినిమా సెట్స్ మీదకు వెళ్తే మాత్రం ఆ మూవీ మరో ఏడాది పడుతుంది. సుజిత్ తో సినిమా అంటే ఈసారి పాన్ ఇండియా బొమ్మ అన్నట్టే. ఎలాగు ఓజీతో డైరెక్టర్ గా సుజిత్ తన మార్క్ చూపిస్తాడు కాబట్టి నానికి సుజిత్ తో సినిమా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచు.
నాని ప్యారడైజ్ తర్వాత సుజిత్ మాత్రమే కాదు హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో కూడా ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది. నాని సినిమాల ప్లానింగ్ తో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాడు. సుజిత్ కూడా ఓజీ తర్వాత మరీ లేట్ చేయకుండా నెక్స్ట్ సినిమా వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఐతే అది నాని సినిమా అవుతుందా లేదా మరోటా అన్నది త్వరలో తెలుస్తుంది.
