Begin typing your search above and press return to search.

అక్కడ బాహుబలిని బీట్ చేసిన OG.. టాప్ 10లో ఇలా..

మాస్ ఏరియాల్లో పవన్ హవా బలంగా కొనసాగుతుండటంతో, లాంగ్ రన్‌లో బిజినెస్ మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By:  M Prashanth   |   26 Sept 2025 12:16 PM IST
అక్కడ బాహుబలిని బీట్ చేసిన OG.. టాప్ 10లో ఇలా..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ OG బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కలెక్షన్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేసింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా బలమైన కలెక్షన్లు సాధించింది. ఫ్యాన్స్ ఎక్కడ చూసినా భారీగా థియేటర్లకు తరలి వచ్చి ఉత్సాహంగా స్వాగతించారు. టాక్ ఎలా ఉన్నా కూడా యువ దర్శకుడు సుజిత్ ఫ్యాన్స్ కు సరిపోయే థ్రిల్స్ ఇచ్చారని టాక్ కూడా వస్తోంది.

ఇక ఏపీ తెలంగాణలో కలెక్షన్లు సాలీడ్ గానే వచ్చాయి. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన జిల్లా నెల్లూరు. ఇక్కడి బాక్సాఫీస్ వద్ద పవన్ స్టామినా మరోసారి హైలెట్ అయ్యింది. ప్రీమియర్స్ కలిపి ఓజీ మొదటి రోజే 2.13 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాదు, నెల్లూరు డిస్ట్రిక్ట్ రికార్డుల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం దక్కించుకుంది.

ఇక ఈ వసూళ్లతో ఓజీ నెల్లూరులో టాప్ 10 ఓపెనింగ్స్ జాబితాలోకి ఎంటర్ అయింది. ముఖ్యంగా ఆచార్య, బాహుబలి 2, సైరా, గేమ్ చేంజర్ వంటి బిగ్ టికెట్ మూవీస్‌ను సమీపంలో ఉంచుతూ పవన్ సినిమా తన మార్క్ చూపించింది. టాక్ మిక్స్‌గా ఉన్నప్పటికీ, పవన్ స్టైల్ ఫ్యాన్స్‌కి కనెక్ట్ కావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ షోలు కంటిన్యూ చేస్తున్నాయి.

గురువారం విడుదల కావడం, దసరా సెలవులు దగ్గరగా ఉండటం, వీకెండ్ కలసి రావడం వల్ల ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశముంది. మాస్ ఏరియాల్లో పవన్ హవా బలంగా కొనసాగుతుండటంతో, లాంగ్ రన్‌లో బిజినెస్ మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక నెల్లూరులో మొదటి రోజు టాప్ వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇలా ఉన్నాయి:

ఆర్ఆర్ఆర్: 3.01 కోట్లు

పుష్ప 2: 2.90 కోట్లు

సాహో: 2.56 కోట్లు

దేవర: 2.49 కోట్లు

ఆచార్య: 2.29 కోట్లు

ఓజీ: 2.13 కోట్లు

బాహుబలి 2: 2.10 కోట్లు

సైరా: 2.09 కోట్లు

గేమ్ చేంజర్: 2 కోట్లు

వకీల్ సాబ్: 1.70 కోట్లు

మొత్తం మీద, పవన్ కళ్యాణ్ ఓజీతో మరోసారి నెల్లూరులో తన స్ట్రాంగ్ బేస్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. వసూళ్ల హావా ఇంకా కొనసాగుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని ఏటియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడికి 45% పైగా రికవరీ అయినట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కెరీర్ లో అత్యధికంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా OG రికార్డ్ క్రియేట్ చేసింది.