Begin typing your search above and press return to search.

ఓజీ 2కే పవన్ జై.. రీజనేంటి?

సుజీత్ కూడా నాని ప్రాజెక్ట్‌ ను పక్కన పెట్టి ముందుగా ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ లైనప్ లో ఓజీ 2 కాకుండా సురేందర్ రెడ్డి మూవీ కూడా ఉంది.

By:  M Prashanth   |   14 Jun 2026 1:40 AM IST
ఓజీ 2కే పవన్ జై.. రీజనేంటి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఇప్పుడు ఒక్కసారిగా కొత్త జోష్ కనిపిస్తోంది. అందుకు కారణం ఓజీ 2పై వచ్చిన కొత్త అప్డేట్. రాజకీయాల్లో ఫుల్ గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు దూరమవుతారని ఊహాగానాలు నడుస్తున్న వేళ.. ఓజీ సీక్వెల్ వార్త అభిమానులకు పెద్ద రిలీఫ్‌ గా మారింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓజీ 2కే పవన్ జై అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా పవన్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. పవర్ స్టార్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్, తమన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఆ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. సినిమా విడుదల సమయంలో సీక్వెల్ ఉంటుందని టీమ్ సిగ్నల్స్ ఇచ్చింది. సక్సెస్ మీట్‌ లో పవన్ సుజీత్ ప్లాన్ చేసుకో.. ఓజీ 2 చేస్తున్నామమని ప్రకటించడం ఫ్యాన్స్ లా భారీ అంచనాలు పెంచింది.

అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. దర్శకుడు సుజీత్ నానితో చేయాల్సిన బ్లడీ రోమియో పనుల్లో బిజీ అయ్యారని వార్తలు వచ్చాయి. దీంతో ఓజీ 2 ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు ఓజీ సీక్వెల్‌ పై పవన్ టీమ్ నుంచి అప్డేట్ రావడంతో అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. పవన్ డేట్స్ ఇస్తే నవంబర్‌ లోనే ఓజీ 2 పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

సుజీత్ కూడా నాని ప్రాజెక్ట్‌ ను పక్కన పెట్టి ముందుగా ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ లైనప్ లో ఓజీ 2 కాకుండా సురేందర్ రెడ్డి మూవీ కూడా ఉంది. కానీ ఆయన ఓజీ సీక్వెల్‌ వైపే ముందు ఆసక్తి చూపడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. పవన్ ఇటీవల చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఓజీ మాత్రం వారికి అభిమానుల ప్రత్యేక అనుభూతిని ఇచ్చిన చిత్రంగా నిలిచింది.

అందుకే ఇప్పుడు పవన్ ఓజీ వైపు మొగ్గు చూపారని, తర్వాత సురేందర్ రెడ్డి మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే కథ పరంగా కూడా ఓజీ సీక్వెల్ ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. పవన్ రోల్ ఫ్లాష్ బ్యాక్ ను, ముఖ్యంగా జపాన్ ఎపిసోడ్‌ ను కంప్లీట్ గా చూపిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వొచ్చని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొత్త పాత్రలు కూడా సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇక సినిమాను డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తారా? లేక పవన్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతుందా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. తమన్ మరోసారి సంగీతం అందించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఓజీ 2పై అధికారిక ప్రకటన రాకపోయినా.. పవన్ టీమ్ నుంచి వచ్చిన అప్డేట్ మాత్రం పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపింది. రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న పవన్ నుంచి ఓజీ సీక్వెల్‌ రూపంలో వచ్చే స్టైలిష్ యాక్షన్ ట్రీట్ ఎలా ఉంటుందో.. ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.