సుజీత్.. ఈసారి ప్రియాంకను పక్కన పెడుతున్నారా?
సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయని అభిమానులు చెబుతున్నారు.
By: M Prashanth | 24 Jun 2026 11:29 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ-2 కోసం ఎంతో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ విడుదలైన వెంటనే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు మూవీ గురించి కూడా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో దర్శకుడు సుజీత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఏ సినిమా సీక్వెల్ వచ్చినా ఫస్ట్ పార్ట్ లోని కొన్ని పాత్రలు కొనసాగుతాయి. మరికొన్ని రోల్స్ కథ అవసరాల మేరకు కనిపించవు. ఇప్పుడు ఓజీ 2 విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి భాగంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ రెండో భాగంలో ఉంటారా లేదా అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.
ఓజీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఆ కథలో హీరోయిన్ పాత్రకు లిమిట్ రేంజ్ లోనే స్క్రీన్ స్పేస్ లభించింది. అయినప్పటికీ తన నేచురల్ యాక్టింగ్ తో ప్రియాంక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఆమె కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయని అభిమానులు చెబుతున్నారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ప్రియాంక తన నటనతో మెప్పించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. భారీ యాక్షన్ కథలో హీరోయిన్ పాత్ర పెద్దగా లేకపోయినా, కథకు అవసరమైన ఎమోషనల్ స్ట్రెంత్ అందించడంలో ఆమె రోల్ యూజ్ అయిందని చెప్పాలి.
కథ పరంగా చూస్తే ప్రియాంక పాత్ర మొదటి భాగంలోనే ముగిసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర ముగింపే హీరో పాత్రను మరింత స్ట్రాంగ్ గా చూపించే కీలక మలుపుగా ఉపయోగపడిందని టాక్. ఇదే కారణంగా రెండో భాగంలో ఆమె పాత్ర కొనసాగడం కాస్త కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు దర్శకుడు సుజీత్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి బాలీవుడ్ కు చెందిన ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకురావాలనే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా తెలుగు సినిమాలు నేషనల్ వైడ్ గా భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. అందుకే పాన్ ఇండియా ప్రేక్షకులను మరింత ఆకర్షించేలా స్టార్ కాస్టింగ్ పై నిర్మాతలు, దర్శకులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అదే ప్లాన్ ఓజీ 2 కోసం కూడా ఫాలో అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ప్రియాంక అరుల్ మోహన్ ను పూర్తిగా పక్కన పెట్టేశారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే కొత్త హీరోయిన్ సెలక్షన్ గురించి కూడా మూవీ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇవన్నీ రూమర్లుగా ఉన్నాయి. మరి సుజీత్ నిజంగానే కొత్త హీరోయిన్ ను రంగంలోకి దింపుతారా? లేక కథలో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ప్రియాంక పాత్రను మళ్లీ తీసుకొస్తారా? అన్నది వేచి చూడాలి.
