పిక్‌టాక్ : ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ, ఢిల్లీలో మీటింగ్స్, పార్టీ కార్యక్రమాలు, మీటింగ్‌లు, అధికారులతో పర్యవేక్షణ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఫుల్ బిజీగా ఉంటాడు.
By: Ramesh Palla | 2 July 2026 11:50 AM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ, ఢిల్లీలో మీటింగ్స్, పార్టీ కార్యక్రమాలు, మీటింగ్‌లు, అధికారులతో పర్యవేక్షణ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఫుల్ బిజీగా ఉంటాడు. చేతికి గాయం అయినప్పటికీ ఆపరేషన్ వాయిదా వేసుకుని మరీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అంతగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు వస్తాడని, ఆయన సినిమాల్లో నటిస్తాడని చాలా మంది అనుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా అంతకు ముందు కమిట్ అయిన సినిమాలే అనే విషయం తెల్సిందే. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్న క్రమంలోనూ పవన్ ఒక మూవీని కమిట్ అయ్యాడని, అది 'ఓజీ 2' అంటూ ఈ మధ్య కాలంలో తెగ ప్రచారం జరుగుతోంది.
ఓజీ 2 సినిమా కోసం పవన్ కళ్యాణ్...
ఇటీవల దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఓజీ 2 గురించి చర్చించడం జరిగింది. పవన్‌కి మాత్రమే కాకుండా ఆయన ఫ్యాన్స్‌కి ఎంతగానో నచ్చిన మూవీ ఓజీ. అందుకే ఆ సినిమాకు కొనసాగింపుగా ప్రాంచైజీలో మూవీ చేయాలని పవన్, సుజీత్ నిర్ణయించారు. ఆ సినిమా నిర్మాణంలో పవన్ సైతం నిర్మాణ భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఓజీ ప్రాంచైజీ మూవీలో ఓజీ నిర్మాత ఉండక పోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే ఓజీ 2 గురించిన చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగానే పవన్ కళ్యాణ్ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక మూవీ స్టిల్స్ అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెస్పాన్స్ ఉంటుంది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే వైరల్ అయ్యింది.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్...
అభిమానులు, అన్ని వర్గాల వారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు చెందిన ఈ కొత్త స్టిల్‌ను తెగ షేర్ చేశారు. నిమిషాల వ్యవదిలోనే వైరల్ అయ్యింది. ఓజీ 2 హ్యాష్ ట్యాగ్‌తో చాలా మంది ఈ ఫోటోను షేర్ చేయడంతో మళ్లీ ఓజీ సినిమా గురించిన చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో దర్శకుడు సుజీత్ అది ఇస్తాడని మరోసారి ఈ ఫోటోతో నిరూపితం అయ్యింది. చాలా సింపుల్ స్టిల్‌లో పవన్ కళ్యాణ్ చూపు తిప్పలేనంతగా ఆకట్టుకుంటున్నాడని అభిమానులు అంటున్నారు. బ్లాక్ హుడీలో గడ్డంలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఇదే లుక్‌లో దర్శకుడు సుజీత్ ఓజీ 2 లో చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇదే లుక్‌తో ఓజీ 2 వస్తే కచ్చితంగా ఫ్యాన్స్ కి మరో పెద్ద పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓజీ 2 సినిమా ప్రారంభంకు...
ఓజీ కథకు కొనసాగింపు అవకాశం ఉంది. మొదటి పార్ట్‌లో కథను కొనసాగిస్తూ ఓజీ 2 సినిమాను దర్శకుడు సుజీత్ తీస్తాడా లేదంటే కొత్త కథతో వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇటీవల పవన్ కళ్యాణ్ ను సుజీత్ కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో తీసుకున్న ఫోటోనే ఇది. సాదారణంగానే ఫోటోను తీశారా లేదంటే ప్రత్యేకంగా లుక్ టెస్ట్ కోసం ఏమైనా తీశారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఎలా తీస్తే ఏంటి సినిమాలో పవన్ ఇలా కనిపిస్తే మాకు పండగే అన్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఓజీ 2 సినిమాకు తమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఓజీ కోసం ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అభిమానులు పిచ్చెక్కి పోయారు. మరోసారి ఆ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తే కచ్చితంగా ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ దక్కడం ఖాయం. పవన్ ప్రస్తుతం చేతి గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ఏడాది చివరి వరకు ఓజీ 2 షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చు.
