'ఓజీ-2' చేయాలంటే వాళ్లంత కమిట్ మెంట్!
పార్ట్ -2 ఉంటుందని ప్రకటించినంత ఈజీ కాదు పట్టాలెక్కించడం. అలా దిగ్విజయంగా పూర్తి చేయగల్గింది ఇద్దరు మాత్రమే.
By: Srikanth Kontham | 30 Sept 2025 10:09 AM ISTపార్ట్ -2 ఉంటుందని ప్రకటించినంత ఈజీ కాదు పట్టాలెక్కించడం. అలా దిగ్విజయంగా పూర్తి చేయగల్గింది ఇద్దరు మాత్రమే. వారే రాజమౌళి.. సుకుమార్. `బాహుబలి`ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి షూటింగ్ మధ్యలో తీసుకున్న నిర్ణయమిది. అనుకున్నట్లే `బాహుబలి ది బిగినింగ్`.. `బాహుబలి ది కన్ క్లూజన్` ని దిగ్వివిజయంగా పూర్తి చేసారు. ఆ తర్వాత `పుష్ప` విషయంలో సుకుమార్ కూడా ఇలాగే చేసారు. సగం షూటింగ్ లో ఔట్ పుట్ చూసుకుని సినిమా లెంగ్త్ పెరగడంతో ఇంటర్వెల్ ని క్లైమాక్స్ గా మార్చి `పుష్ప ది రైజ్` అంటూ రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు.
వాళ్లిద్దరు తర్వాత వీళ్లిద్దరూ:
అటుపై `పుష్ప 2` ది రూల్ అంటూ రెండవ భాగాన్ని అంతకు మించి సక్సెస్ చేసారు. ఈ రెండు సినిమాలు రెండు భాగాలు దిగ్విజయంగా రిలీజ్ అయ్యాయి? అంటే అందుకు కారణం మొదటి భాగాలు భారీ విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో రెండవ భాగాన్ని పట్టాలెక్కించగలిగారు అన్నది కాదనలేని వాస్తవం. అదే మొదటి భాగం ఫెయిలైతే? రెండవ భాగం ఉండటానికి ఎంత మాత్రం అవకాశం ఉండదు. రాజమౌళి, సుకుమార్ దారిలోనే ఇప్పు డు కొరటాల శివ కూడా `దేవర 2` విషయంలో ముందుకెళ్తున్నాడు. అందుకు ఎన్టీఆర్ కోరటాలకు కావాల్సినంత సహకారం అందిస్తున్నాడు.
డివైడ్ టాక్ వచ్చినా తగ్గేదేలే:
దేవర పార్ట్ 1 అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ ఆ ద్వయం `దేవర` అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. మొదటి భాగానికి డివైడ్ టాక్ వచ్చినా ఆ లెక్కలన్నింటిని `దేవర2` తో సరి చేస్తాం అన్న కాన్పిడెన్స్ ఆ ద్వయంలో కనిపిస్తోంది. అందుకే మరోసారి `దేవర2` చేస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ వేసి మరీ చెప్పారు. ఈ విషయంలో ఇద్దరు ఎంతో డేరింగ్ నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన `ఓజీ`కి రెండవ భాగంగా `ఓజీ`2 కూడా ఉంటుందంటున్నారు. సుజిత్ కూడా ప్రకటించాడు. `ఓజీ` ఫలితం తెలిసిందే. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.
ఆయనపైనే సందేహం:
అయినా ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా రెండవ భాగం చేస్తామంటున్నాడు. కానీ అదెప్పుడు అన్నది ప్రత్యేకించి చెప్పలేద. పవన్ కూడా విషయాన్ని అంగీకరించారు. ఈ నేపథ్యంలో `ఓజీ 2` సాధ్యాసాధ్యాలపై మార్కెట్లో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పవన్ ఎస్ చెబితే? సుజిత్ చేయడానికి ఏమాత్రం డిలే చేయడు. కానీ పవన్ స్థిర త్వంగా పని చేస్తారా? అన్నదే సందేహంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ రీసెంట్ రిలీజ్ లు హైలైట్ అవుతున్నాయి. ఐదేళ్ల క్రితం మొదలు పెట్టిన `హరిహరవీరమల్లు` ఐదేళ్ల తర్వాత రిలీజ్ అయింది.
ఓజీ 2 సాధ్యమేనా?
`ఓజీ `విషయంలో జరిగిన డిలే గురించి తెలిసిందే. ఇంకాస్త గతంలోకి వెళ్తే.. పవన్ మొత్తం కెరీర్ లో ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసింది రెండుసార్లే. 2012 లో `గబ్బర్ సింగ్`, `రాంబాబు` రిలీజ్ లతో ప్రేక్షకుల మధ్యలో ఉన్నారు. ఆ తర్వత మళ్లీ 13 ఏళ్లకు 2025 లో `ఓజీ`,` వీరమల్లు` రిలీజ్ చేసారు. మధ్యలో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసారు. మరి ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన పవన్ నుంచి `ఓజీ 2` ఎంత వరకూ పాజిబుల్ అవుతుందో చూడాలి.
