OG 2.. ఇప్పుడు పెద్ద సమస్య ఇదే..
యాక్షన్, లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, మ్యూజిక్ ఇలా చాలా ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు OG 2పై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.
By: M Prashanth | 25 Sept 2026 7:00 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తేనే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉంటాయి. ఇక OG తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పవన్ ను కొత్త స్టైల్ లో చూపించింది. యాక్షన్, లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, మ్యూజిక్ ఇలా చాలా ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు OG 2పై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే దాని రెండో పార్టుపై అంచనాలు పెరుగుతాయి. కానీ OG విషయంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. మొదటి భాగంలో పవన్ కనిపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది. ఆయన రోల్ లోని స్టైల్, యాక్షన్ సీన్లు, డైలాగ్స్, మాస్ మూమెంట్స్ స్పెషల్ గా నిలిచాయి. దీంతో OG 2లో వీటన్నింటినీ మరింత బిగ్ రేంజ్ లో చూడాలని అభిమానులు ఆశించడం కామన్.
ఇక్కడే అసలు సమస్య ఉంది. మొదటి సినిమాలో ఏది నచ్చిందో అదే మళ్లీ సీక్వెల్ లో చూపిస్తే రిపీట్ అనే మాట వస్తుంది. అలా కాకుండా పూర్తిగా కొత్తగా వెళ్తే మొదటి సినిమా ఇచ్చిన OG ఫీల్ మిస్ అయిందనే చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే పాత క్రేజ్ ను కొనసాగిస్తూనే కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పవన్ రోల్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి.
సీక్వెల్ లో ఆ పాత్రకు ఎలాంటి కంటిన్యూషన్ ఇస్తారు, ఆ పాత్రను ఇంకెంత పవర్ ఫుల్ గా చూపిస్తారనే విషయాలపై సినీ ప్రియుల్లో ఇప్పటికే ఇంట్రెస్ట్ ఉంది. అందుకే పవన్ కనిపించే ప్రతి సీన్ ను అంతా చాలా స్పెషల్ గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ కచ్చితంగా ఉంది. అంతేకాదు.. యాక్షన్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లుక్స్, డైలాగ్స్ విషయంలో కూడా ఫస్ట్ పార్ట్ తో కంపేరిజన్ తప్పదు.
మొదటి సినిమా ఇచ్చిన కిక్ ను మళ్లీ తీసుకురావడంతో పాటు ఈసారి కొత్తగా ఏం చూపిస్తారనేది సీక్వెల్ విషయంలో మెయిన్ గా మారుతుంది. ముఖ్యంగా సీక్వెల్ కు తనకంటూ స్పెషల్ క్రేజ్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇక OG తర్వాత దర్శకుడు సుజీత్ పై కూడా అంచనాలు పెరిగాయి. దీంతో OG 2 కేవలం పవన్ సినిమా అనే రేంజ్ లో కాకుండా.. సుజీత్ విజన్ ఎలా ఉండబోతుందనే యాంగిల్ లోనూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక OG 2పై ప్రేక్షకులు సినిమా విడుదలయ్యే వరకు మాత్రమే కాకుండా, ప్రతి చిన్న అప్డేట్ వచ్చినప్పుడే రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పవన్ లుక్, షూటింగ్ అప్డేట్, మ్యూజిక్, టీజర్ ఇలా ఏ విషయం బయటకు వచ్చినా చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని సుజీత్ ఎలాంటి వరల్డ్ ను రెడీ చేస్తారనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుకే OG 2కి కథ కంటే పెద్ద సమస్య.. ప్రేక్షకుల అంచనాలే అనిపిస్తోంది.
