Begin typing your search above and press return to search.

అక్టోబర్లో సందడి చేయబోయే చిత్రాలు ఇవే.. అందరిచూపు ఆ 2 మూవీల పైనే!

మరి అక్టోబర్ నెలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

By:  Madhu Reddy   |   26 Sept 2025 4:31 PM IST
అక్టోబర్లో సందడి చేయబోయే చిత్రాలు ఇవే.. అందరిచూపు ఆ 2 మూవీల పైనే!
X

సాధారణంగా ప్రతి నెల కూడా కొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ నెల ఆరంభంలో ఘాటీ, లిటిల్ హార్ట్స్, మదరాసి అంటూ కొన్ని చిత్రాలు రాగా.. ఆ తర్వాత మిరాయ్ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అలా ఈనెల వరుస చిత్రాలతో మరో మూడు రోజుల్లో ముగియనుంది. అయితే వచ్చేనెల ఏ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ప్రేక్షకులను మెప్పించడానికి ఏ హీరో సిద్ధం అయ్యారు? అనే విషయాలు అభిమానులలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి అక్టోబర్ నెలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

అక్టోబర్ 1 :

ఇడ్లీ కొట్టు:

ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిత్యామీనన్ హీరోయిన్గా, ధనుష్ హీరోగా రాబోతున్న చిత్రం ఇడ్లీ కొట్టు. ఇడ్లీ కడై పేరుతో తమిళంలో రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఇడ్లీ కొట్టు అంటూ రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

కర్మనే వాధికారిస్తే -1

అక్టోబర్ 2:

కాంతార చాప్టర్ 1: హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతార సినిమా ప్రీక్వెల్ గా రాబోతోంది ఈ సినిమా. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని హోం భలే భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది.

అక్టోబర్ 10:

1.శశివదనే

2. మారియో

3. సీత ప్రయాణం కృష్ణతో

4. ట్రాన్స్ ఎరిస్

5. ఎర్ర చీర

6. కానిస్టేబుల్

అక్టోబర్ 16:

మిత్రమండలి

అక్టోబర్ 17:

1.తెలుసు కదా

2. ఫ్రెండ్లీ ఘోస్ట్

3. డ్యూడ్

4. కాంత

అక్టోబర్ 18:

కె -ర్యాంప్

అక్టోబర్ 31:

1. బాహుబలి ది ఎపిక్

2. మాస్ జాతర

ఇకపోతే ఒక్క అక్టోబర్ నెలలోనే ఇడ్లీ కొట్టు, కాంతార చాప్టర్ 1, బాహుబలి ది ఎపిక్ అండ్ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం అందరి చూపు కాంతార చాప్టర్ వన్ ,బాహుబలి ది ఎపిక్ చిత్రాలపైనే ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర మూవీ కూడా వచ్చే నెలలోనే విడుదల కాబోతుండడంతో అటు అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు.

అలాగే కిరణ్ అబ్బవరం కొడుకు పుట్టిన తర్వాత కె - ర్యాంప్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ కూడా వచ్చే నెలలో విడుదలవుతూ ఉండడం గమనార్హం. మరి ఇన్ని చిత్రాల మధ్య ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందో చూడాలి..