ఫ్రైడే ఫైట్.. ముగ్గురు మూడు డిఫరెంట్ కథలతో..!
స్టార్ సినిమాలే కాదు యువ హీరోల సినిమాల ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొత్త కథలతో చేసే ప్రయత్నాలు కొన్నైతే యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చి మెప్పించేవి మరికొన్ని ఉన్నాయి.
By: Ramesh Boddu | 12 Oct 2025 8:00 PM ISTస్టార్ సినిమాలే కాదు యువ హీరోల సినిమాల ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొత్త కథలతో చేసే ప్రయత్నాలు కొన్నైతే యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చి మెప్పించేవి మరికొన్ని ఉన్నాయి. ఐతే ఈ వీకెండ్ కి మూడు సినిమాలు ముగ్గురు హీరోలు తమ లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు. అందులో ఒక తమిళ యువ హీరో కూడా ఉండటం విశేషం. ఐతే ఆ సినిమా నిర్మించింది మాత్రం తెలుగు బడా ప్రొడక్షన్ హౌస్ అవ్వడంతో ఆ సినిమాకు కూడా తెలుగులో మంచి రిలీజ్ లు పడుతున్నాయి.
లవ్ స్టోరీనే కానీ డిఫరెంట్ అటెంప్ట్..
అక్టోబర్ 17న మూడు సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరుగుతుంది. అందులో మొదటి సినిమా సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా వస్తుంది. సిద్ధు, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా లవ్ స్టోరీనే కానీ డిఫరెంట్ అటెంప్ట్ అని అంటున్నారు. థమన్ మ్యూజిక్ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లింది.
జాక్ తో షాక్ తగిలిన సిద్ధుకి తెలుసు కదాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పోటీ ఉన్నా కూడా తెలుసు కదా టీం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఇక నెక్స్ట్ కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ కూడా రేసులో ఉంది. జైన్స్ నాని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ కంటెంట్ ప్లస్ కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా వస్తుంది.
రణ్ అబ్బవరం సినిమాపై కూడా సూపర్ కాన్ఫిడెంట్..
కె ర్యాంప్ ట్రైలర్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. కిరణ్ అబ్బవరం సినిమా పై కూడా సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక అక్టోబర్ 17న రిలీజయ్యే సినిమాల్లో తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ వస్తుంది. కీర్తీశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా యూత్ ఫుల్ స్టోరీగా వస్తుంది.
సినిమాలో ప్రదీప్ కి జతగా ప్రేమలు హీరోయిన్ మమితా బైజు వస్తుంది. డ్యూడ్ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఐతే ఈ 3 సినిమాల్లో ఆడియన్స్ ఫేవరెట్ ఏంటన్నది రిలీజ్ రోజు తెలుస్తుంది. ఈ సినిమాల్లో ప్రదీప్ ఆల్రెడీ లవ్ టుడే, డ్రాగన్ సినిమాల సక్సెస్ ల తర్వాత డ్యూడ్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. కిరణ్ అబ్బవరం క తో సూపర్ కంబ్యాక్ ఇచ్చినా మళ్లీ దిల్ రూబా తో మరో షాక్ తిన్నాడు. కె ర్యాంప్ తో అలరించేలా ఉన్నాడు. సిద్ధు తెలుసు కదా కూడా ప్రమోషన్స్ అయితే బాగున్నాయి. సినిమా ఏం చేస్తుందో చూడాలి.
