పిక్‌టాక్ : ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
By: Ramesh Palla | 20 March 2026 1:00 PM ISTతెలుగు ప్రేక్షకులకు నైరా ఎం బెనర్జీ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ హీరోయిన్ మధురిమ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వస్తుంది. తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పలు సినిమాల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్‌గా ఈమెకు సాలిడ్ హిట్ పడక పోవడంతో అదృష్టం కలిసి రాలేదు. ఇండస్ట్రీలో లాంగ్ టైమ్ స్టార్‌డం కలిగి ఉండే అవకాశం కేవలం సక్సెస్‌తోనే దక్కుతుంది అనే విషయం మధురిమ విషయంలో మరోసారి నిరూపితం అయ్యింది. ఆకట్టుకునే అందంతో పాటు, నటన ప్రతిభ ఉన్నప్పటికీ ఈ అమ్మడికి లక్ కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద విజయాలను సొంతం చేసుకోలేక పోయింది. దాంతో పెద్ద సినిమాల్లో, స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అయింది. అయితే ఇప్పటికీ ఈమె ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.
బాలీవుడ్‌లో సినిమాతో...
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు ప్రేక్షకులకు ఆ ఒక్కడు సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా మధురిమ కి తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభించింది. దాంతో ఈమెకు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. హీరోయిన్‌గా ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు అయిదు ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో ఒక హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన కొత్త సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కేవలం హీరోయిన్‌గానే కాకుండా మంచి పాత్రలతో వస్తే ఎలాంటి సినిమాలో అయినా నటించేందుకు ఓకే అన్నట్లుగా ఈమె ఉందట. అందుకే ఈ మధ్య వరుసగా ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలు...
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలతో పాటు 'నిజం చెప్పండి.. నేను చూడ్డానికి కూల్‌గా ఉన్నానా లేదంటే గందరగోళంగా ఉన్నానా?' అంటూ ప్రశ్నిస్తూ ఈ అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన చాలా మంది చాలా కూల్‌గా అందంగా ఉన్నారు. మీరు లోపల ఎంత గందరగోళంగా ఉన్నారో తెలియదు, కానీ బయటకు మాత్రం చాలా అందంగా కూల్‌గా కనిపిస్తున్నారు అంటూ కొందరు కామెంట్ చేశారు. మొత్తానికి మధురిమ ఈ కొత్త ఫోటోలు ఆమెను మరోసారి వార్తల్లో నిలిచాయి. అంతే కాకుండా ఇండస్ట్రీ దృష్టిని ఆమె ఆకర్షించడంలోనూ సక్సెస్ అయిందని చెప్పాలి. చాలా కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో మధురిమ ఆకట్టుకుంది. అందమైన మధురిమ మరోసారి హీరోయిన్‌గా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమెకు మళ్లీ మునుపటి రోజులు వచ్చేనా అనేది చూడాలి.
మధురిమ అందాల ఆరబోత ఫోటోలు..
వైట్ కలర్ ఔట్ ఫిట్ లో డిఫరెంట్ లైటింగ్‌లో మధురిమ మరింత అందంగా కనిపిస్తోంది. నాలుగు పదుల వయసుకు చేరువ అయినా ఇంతటి అందం ఎలా సాధ్యం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడం వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ ఈమెను గుర్తిస్తున్నారు. ఆ గుర్తింపును ఉపయోగించుకుని మధురిమ నటిగా మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఓటీటీ వెబ్ సిరీస్‌లు అంటూ ప్రేక్షకులు కొత్త వినోద మార్గంను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ ఈమె తన అవకాశాలను ప్రయత్నిస్తే తప్పకుండా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది విశ్లేషకుల మాట. త్వరలోనే మధురిమ తెలుగులోనూ ఏదో ఒక పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. తెలుగులో ఈమె చివరిగా పదేళ్ల క్రితం నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో కనిపించింది.
