ఫోటో స్టోరి: టాప్ లేపేసిన యంగ్ బ్యూటీ నువేక్ష
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తున్న భామల జాబితాలో నువేక్ష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
By: Sivaji Kontham | 17 April 2026 7:00 AM ISTప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తున్న భామల జాబితాలో నువేక్ష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. క్యూట్ లుక్స్‌తోనే కాకుండా.. తనదైన హాట్ అప్పియరెన్స్‌తో నెట్టింట భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. తన గ్లామర్ పవర్ చూపిస్తూ... ఆహార్యంతో నెటిజనుల మతులు చెడగొడుతోంది.
నువేష్క తాజా ఇన్‌స్టా పోస్ట్ చూస్తే.. ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్ రేంజేంటో అర్థమవుతుంది. బో*ల్డ్ అండ్ క్లాసీ లుక్ కలబోసినట్లున్న నువేష్క వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూనిక్ డ్రెస్ సెన్స్ తో ఈ బ్యూటీ టాప్ లేపేసిందని చెప్పాలి. ఎంపిక చేసుకున్న మోడ్రన్ అవుట్‌ఫిట్ గ్లామర్ డోస్‌ను అమాంతం పెంచేసింది. కెమెరా కళ్ళకు మత్తెక్కించే ఫోజులిస్తూ.. తన అందచందాలను అద్భుతంగా ప్రదర్శించింది.
నువేష్క సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు `అతిథి దేవో భవ` సినిమాతో పరిచయమైంది. ఆది సాయికుమార్ సరసన నటించిన ఈ చిత్రంలో తన క్యూట్ పర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. హీరోయిన్‌గా తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించిన ఈ బ్యూటీ.. నటనలోనూ ప్రతిభను చాటుకుంది. తన చురుకైన చూపులు, హావభావాలతో తెలుగు కుర్రాళ్ళను మెప్పించగలిగింది.
కేవలం `అతిథి దేవోభవ` మాత్రమే కాకుండా..నువేక్ష తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రల కోసం ఎదురుచూస్తోంది. తను నటించిన మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉండగా... సోషల్ మీడియాలో ఈ భామ చూపిస్తున్న జోరు చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్‌లో మరిన్ని క్రేజీ ఆఫర్లు అందుకునేలా కనిపిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన అన్ని హంగులు ఈ యంగ్ బ్యూటీలో పుష్కలంగా ఉన్నాయని తన ఫోటోలు సాక్ష్యం చెబుతున్నాయి.
నువేష్క తన అందం- అభినయంతో ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సినిమాలతో మెప్పిస్తూనే... మరోవైపు ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్లతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు తనకు మరిన్ని భారీ అవకాశాలను తెచ్చిపెడతాయనడంలో సందేహం లేదు.
