Begin typing your search above and press return to search.

మినీ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న నువేక్ష!

జెన్ జీ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ట్రెండుకు తగ్గట్టుగా దుస్తులను ధరిస్తూ గ్లామర్ వలకబోస్తూ తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   9 Jun 2026 11:34 AM IST
మినీ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న నువేక్ష!
X

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో దర్శనం ఇస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. జెన్ జీ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ట్రెండుకు తగ్గట్టుగా దుస్తులను ధరిస్తూ గ్లామర్ వలకబోస్తూ తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రోజుకొక ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సెలబ్రిటీలు.. అటు సినిమాలతో బిజీగా ఉన్నా.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోత ఆపడం లేదు. ఈ క్రమంలోనే మరో బ్యూటీ మినీ డ్రెస్ లో దర్శనమిచ్చి హొయలు పోయింది.




తాజాగా రెడ్ కలర్ డీప్ స్కూప్ నెక్ లైన్ తో డిజైన్ చేసిన రిబ్బెడ్ స్లీవ్ లెస్ క్రాప్ టాప్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్లో క్రీమ్ కలర్ రిబ్డ్ నిట్ షార్ట్ తో జత చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. అసలే మిల్క్ క్రీమ్ లాంటి మేని ఛాయ.. ఇందుకు తగ్గట్టుగా రెడ్ కలర్ క్రాప్ టాప్ ధరించి అందాలు ఆరబోయడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమ్మడి అందానికి ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అని ఒకరు కామెంట్ చేస్తే.. ఇంకొకరు నీ అందాలను చూసి ముగ్ధులవుతున్నాం సఖి అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఏది ఏమైనా నువేక్షా షేర్ చేసిన ఈ మినీ అవుట్ ఫిట్ ఫోటోలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.




1999 ఆగస్టు 1న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన నువేక్ష మోడల్గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు చిత్రాలు చేసి తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. 2021లో తెలుగు రొమాంటిక్ డ్రామా 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఇందులో అను అనే ప్రధాన పాత్ర పోషించింది.. ఆ తర్వాత 2022లో వచ్చిన హిట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్: ది ఫస్ట్ కేస్ చిత్రంతో మంచి బ్రేక్ అందుకుంది. ఇందులో స్వప్న అనే పాత్ర పోషించింది. అదే ఏడాది కిరణ్ అబ్బవరంతో సెబాస్టియన్ పీసీ 524, అతిధి దేవోభవ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. 2024లో రోటి కపడా రొమాన్స్ లో దివ్య పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో భావోద్వేగ నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.




ఇకపోతే సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. ప్రస్తుతం రాబోయే ప్రాజెక్టుల వివరాలు కాస్త గోప్యంగా ఉంచినప్పటికీ త్వరలోనే వాటిపై పూర్తి అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె తదుపరి చిత్రాల గురించి ఎటువంటి అప్డేట్ లేకపోయినా ఆమెకు పెరుగుతున్న అభిమానగనం, చురుకైన ఉనికి చూస్తుంటే.. టాలీవుడ్ లో ముందు ముందు ఈమెకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని తెలుస్తోంది.