ఈకలను తలపించే డ్రెస్ లో మరింత అందంగా నుష్రత్!
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ ఉనికిని చాటుకోవడానికి.. అలాగే అభిమానులను పెంచుకోవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
By: Madhu Reddy | 4 Dec 2025 12:00 AM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ ఉనికిని చాటుకోవడానికి.. అలాగే అభిమానులను పెంచుకోవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అందుకు తగ్గట్టుగా రోజుకు ఒక గ్లామర్ ఫోటోషూట్ వదులుతూ అభిమానులను అలరిస్తున్నారు. అందంతోనే కాదు ట్రెండీ అవుట్ ఫిట్ తో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. అంతే కాదండోయ్ భిన్న విభిన్నమైన వస్త్రధారణలతో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కి పునాదులు వేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ వస్తువులతో, ఆకులతో , పువ్వులతో ఇలా రకరకాలుగా తయారు చేసిన దుస్తులను ధరించి అందర్నీ ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా పక్షి ఈకలను డ్రెస్సుగా రూపొందించి మరీ ధరించింది.
ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఒక సంస్థ అడిగింది అని.. దానిని అందుకు తగ్గట్టుగానే సర్వ్ చేశాము అంటూ ఆ ఫోటోలను పంచుకుంది. ఇందులో చాలా ట్రెండీగా అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో కాదు నుస్రత్ భరూచా. ఫ్యాషన్ ట్రెండ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె తాజాగా మరో అద్భుతమైన ఔట్ఫిట్ తో అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నుస్రత్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే ఈమె ధరించిన ఈ డ్రెస్ ని ప్రముఖ డిజైనర్ సందూష్ రూపొంచారు. సింపుల్ జువెలరీతో తన మెడను మరింత అందంగా మార్చుకుంది. మొత్తానికైతే నుస్రత్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
నుస్రత్ బాల్యం, సినీ కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ టీవీ నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత సినిమా నటిగా అవతరించింది.. 2006లో వచ్చిన జై సంతోషి మా అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె 2010లో వచ్చిన తాజ్ మహల్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 2016లో తమిళంలో వాలిబా రాజా అనే చిత్రంతో అటు తమిళ్ ప్రేక్షకులను కూడా పలకరించింది.
నుస్రత్ భరూచా బాల్యం విషయానికి వస్తే.. 1985 మే 17న ముంబైలో తన్వీర్ భరూచా , తస్నీమ్ భరూచా దంపతులకు జన్మించింది ఇక డిగ్రీ వరకు చదివిన ఈమె.. కిట్టి పార్టీ అనే సీరియల్ ద్వారా కెరియర్ను ఆరంభించింది. తెలుగు, తమిళ్ భాషలలో కేవలం ఒక్కొక్క చిత్రంలో మాత్రమే నటించిన ఈమె ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునేలా ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.
