ఘనంగా ప్రియుడితో రవితేజ హీరోయిన్ పెళ్లి!
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు తాము ప్రేమించిన వ్యక్తులను అభిమానులకు పరిచయం చేయడమే కాకుండా.. నిశ్చితార్థం చేసుకొని ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.
By: Madhu Reddy | 11 Jan 2026 4:15 PM ISTఈమధ్య కాలంలో సెలబ్రిటీలు తాము ప్రేమించిన వ్యక్తులను అభిమానులకు పరిచయం చేయడమే కాకుండా.. నిశ్చితార్థం చేసుకొని ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త ఏడాది మరో కొత్త హీరోయిన్ ఏడడుగులు వేసింది. ఇదివరకే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు వివాహం చేసుకోవడంతో అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ నూతన జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్.. తన ప్రియుడు ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ తో ఏడడుగులు వేశారు. అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సెలబ్రిటీల సమక్షంలో ఉదయపూర్ లో వీరి వివాహం జరిగింది. వారం రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట.. ఇప్పుడు ఏడడుగులు వేసింది.
ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు పంచుకోవడంతో అందులో బాలీవుడ్ నుండి దిశా పటానీ, కబీర్ బాహియా, మౌనీ రాయ్, నిర్మాత దినేష్ విజన్, దర్శకుడు అమర్ కౌశిక్, టాప్ ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ కూడా ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. పైగా వీరంతా కూడా పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.
ఇకపోతే ప్రీ వెడ్డింగ్ వేడుకలు గత రెండు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. పింక్ థీమ్ తో జరిగిన ఈ సంగీత వేడుకలలో సెలబ్రిటీలు డాన్స్ ఫ్లోర్ పై అదరగొట్టేశారు. నుపూర్ సనన్ తో పాటు ఆమె సోదరీ ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో వేడుకకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది. సన్నిహిత స్నేహితుడు కూడా స్టేజ్ పై డాన్స్ చేసి ప్రాంగణాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా "దిల్ తూ జాన్ తూ" పాటకు ఉత్సాహంగా స్టెప్పులేశారు. హల్దీ వేడుకలు కూడా అదే రేంజిలో జరిగాయి. ఇక ఇందుకు సంబంధించిన పెళ్లి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇందులో నిర్మాత రాఘవ శర్మ, నటుడు వరుణ్ శర్మతో పాటు సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఆసిఫ్ అహ్మద్ కూడా కనిపించారు.
మొత్తానికైతే నిశ్చితార్థంతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన నుపూర్ ఏకంగా ఏడడుగులు వేసి కొత్త ఏడాది కొత్త బంధంలోకి అడుగు పెట్టింది.ఇకపోతే రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం నూరని చెహ్రా అనే చిత్రం ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. వివాహం తర్వాత కెరియర్ ను సినిమాలలోనే కొనసాగించేటట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ నూతన జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
