Begin typing your search above and press return to search.

ట్రేండింగ్ : కృతి సనన్ చెల్లి నుపుర్ స‌నోన్ పెళ్లి ఫొటోస్

అదే క్ర‌మంలో కృతి సనన్ పెళ్లి తర్వాతే నుపుర్ పెళ్లాడుతుందంటూ ప్ర‌చార‌మైంది. అక్క పెళ్లి జ‌ర‌గ‌కుండా చెల్లి పెళ్లి అవుతుందా? అంటూ సోష‌ల్ మీడియాలో చాలా గుస‌గుస‌లు వినిపించాయి.

By:  Sivaji Kontham   |   13 Jan 2026 9:51 AM IST
ట్రేండింగ్  : కృతి సనన్ చెల్లి నుపుర్ స‌నోన్ పెళ్లి ఫొటోస్
X

1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి స‌నోన్ సోద‌రి నుపుర్ స‌నోన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్ లో మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` చిత్రంలో న‌టించింది. అయితే ఆ సినిమా ప‌రాజ‌యం ఈ భామ‌కు నిరాశ‌ను మిగిల్చింది. కానీ ఇప్పుడు సడెన్ గా త‌న ప్రియుడిని పెళ్లాడి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అక్క పెళ్ల‌వ‌కుండానే చెల్లి పెళ్లాడేసింది! అంటూ జ‌నంలో ఇది హాట్ టాపిగ్గా మారింది.





న‌టిగా కెరీర్ మొద‌లు సింగ‌ర్ తో డేటింగ్ వ‌ర‌కూ, అటుపై ర‌హ‌స్య నిశ్చితార్థం నుంచి పెళ్లి వ‌ర‌కూ నుపుర్ స‌నోన్ విష‌యంలో ఏం జ‌రిగిందో పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. నూపుర్ పేరు ఇటీవ‌ల సినిమాల‌తో కంటే డేటింగ్ వ్య‌వ‌హారం కార‌ణంగా మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. గత రెండేళ్లుగా నుపుర్ సనన్ ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ తో ప్రేమలో ఉన్నారనే ప్ర‌చారం ఉంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గ‌త ఏడాది చివరలో బలంగా వినిపించాయి. ఇటీవల జరిగిన పలు అవార్డు వేడుకలు, పార్టీలలో జంటగా కనిపించడం, అలాగే కొత్త ఏడాది వేడుకలను కూడా కలిసి జరుపుకోవడంతో వీరి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. గత ఏడాది నుపుర్ త‌న ప్రియుడితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు నుపుర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ వార్త‌ల్ని కొట్టి పారేసారు.





అదే క్ర‌మంలో కృతి సనన్ పెళ్లి తర్వాతే నుపుర్ పెళ్లాడుతుందంటూ ప్ర‌చార‌మైంది. అక్క పెళ్లి జ‌ర‌గ‌కుండా చెల్లి పెళ్లి అవుతుందా? అంటూ సోష‌ల్ మీడియాలో చాలా గుస‌గుస‌లు వినిపించాయి. కృతి స‌నోన్ కూడా బ్రిట‌న్‌ కి చెందిన ఎన్నారై బిజినెస్‌మెన్ క‌బీర్ బాహియాతో డేటింగ్‌లో ఉన్నట్లు రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప‌లుమార్లు ఈ జంట బ్రిట‌న్ లో షికార్ చేస్తున్న ఫోటోలు, వీడియోల‌ను బాలీవుడ్ మీడియా బ‌య‌ట‌పెట్టింది. కాబట్టి సనన్ ఇంట్లో ముందుగా ఎవరి పెళ్లి బాజా మోగుతుందో చూడాలనే ఆస‌క్తి పెరిగింది.





అయితే ఇప్పుడు నుపుర్ అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చింది. నుపుర్ సనన్ సైలెంట్ గా త‌న ప్రియుడు సింగర్ స్టెబిన్ బెన్ ని పెళ్లాడేసింది. ఈ జంట‌ గత కొన్ని రోజులుగా ఉదయపూర్ ప్యాలెస్‌లో సంద‌డి చేస్తున్నారు. అక్క‌డ‌ అంగరంగ వైభవంగా తమ వివాహ వేడుకలను జరుపుకుంటున్నా ఇప్ప‌టివ‌ర‌కూ మీడియా ఫోక‌స్ క‌నిపించ‌లేదు. అయితే ఈ సోమ‌వారం (12 జనవరి) నాడు ఈ అంద‌మైన జంట‌ తమ హిందూ సంప్రదాయ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.





కీర్తి సురేష్ పెళ్లి త‌రహాలోనే రెండు రకాల పెళ్లిళ్లకు ఈ జంట సిద్ధ‌మైంద‌ని తెలిసింది. రెండు వేర్వేరు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. మొదట జ‌న‌వ‌రి 10న క్రిస్టియన్ పద్ధతిలో `వైట్ వెడ్డింగ్` చేసుకున్నారు. ఇందులో నుపుర్ వైట్ గౌనులో, స్టెబిన్ వైట్ టక్సేడోలో మెరిసిపోయారు. ఆదివారం (జ‌న‌వ‌రి 11న‌) ఉదయపూర్‌లోని ఫెయిర్‌మాంట్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. హిందూ వివాహంలో నుపుర్ ఎరుపు, ఆరెంజ్ రంగులు కలిసిన భారీ జర్దోసీ లెహంగాలో కనిపించగా, స్టెబిన్ ముత్యాల అలంకరణ ఉన్న ఆఫ్‌వైట్ షేర్వాణీలో రాయల్‌గా కనిపించారు. వీరిద్దరి వివాహ‌ దుస్తుల‌ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.





ఈ పెళ్లి ఆద్యంతం అటూ ఇటూ తిరిగేస్తూ, అతిథుల‌ను ప‌ల‌క‌రిస్తూ, చాలా సంద‌డి చేసిన‌ నుపుర్ అక్క కృతి సనన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. నుపుర్ ఎంట్రీ సమయంలో కృతి `పూల చాదర్` పట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. నా హృదయం నిండిపోయింది! అంటూ ఫోటోలను షేర్ చేశారు. ఈ వివాహ మ‌హోత్స‌వానికి దిశా పటాని, మౌనీ రాయ్, సునీల్ గ్రోవర్ అతిథులుగా పాల్గొన్నారు. చాలామంది సెలబ్రిటీలతో పాటు కృతి సనన్ ప్రియుడిగా ప్రచారంలో ఉన్న కబీర్ బహియా కూడా హాజరయ్యారు.

పెళ్లి తర్వాత ఈ రోజు (జనవరి 13న‌) ఉదయపూర్ నుండి తిరిగి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో నుపుర్- బెన్ జోడీ మీడియాకు కనిపించారు. నుపుర్ తన మంగళసూత్రం, నల్ల పూసలతో చాలా సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కనిపించారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.