Begin typing your search above and press return to search.

PMC స్కామ్.. తల్లి, చెల్లిని కోల్పోయి భిక్షాటన చేసిన బ్యూటీ !

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి నుపుర్ అలంకార్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మీరు ఒకసారి గూగుల్లో వెతికితే నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అంతా తెలుస్తుంది..

By:  Madhu Reddy   |   1 Nov 2025 1:00 AM IST
PMC స్కామ్.. తల్లి, చెల్లిని కోల్పోయి భిక్షాటన చేసిన బ్యూటీ !
X

ఒక వ్యక్తి జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం చాలా కష్టం. అయితే ఆ గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం జీవితంలో కచ్చితంగా ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటుంది. అందులో భాగంగానే ఒక స్కామ్ లో ఇరుక్కొని తల్లిని, చెల్లిని కోల్పోయి ఆ తర్వాత భిక్షాటన చేసి ఇప్పుడు జీవితాన్నే మార్చుకుంది ఒక ప్రముఖ నటి. అయితే ఈ విషయాలన్నింటినీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయ్యింది... మరి ఆమె ఎవరు ? ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఆ గడ్డు కాలం ఏంటి? అసలేం జరిగిందో అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి నుపుర్ అలంకార్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మీరు ఒకసారి గూగుల్లో వెతికితే నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అంతా తెలుస్తుంది.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(PMC) కుంభకోణం జరిగినప్పుడు జీవితంలో అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. వేలకోట్ల స్కాం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆర్బిఐ పిఎంబి బ్యాంకు పై ఆరు నెలలపాటు ఆంక్షలు విధించింది. వినియోగదారులు ఎవరైనా సరే కేవలం 1000 రూపాయలు మాత్రమే నగదు విత్ డ్రా చేసుకోవచ్చని కఠిన నిబంధనలు కూడా పెట్టింది. ముఖ్యంగా ఆ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకున్న ఎంతో మంది వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అలాంటి వారిలో నేను కూడా ఒకరు. ఈ స్కామ్ తర్వాతే మా అమ్మ అనారోగ్యం పాలయ్యింది. మెరుగైన చికిత్స అందించడానికి బ్యాంకులో డబ్బులు ఉన్నా.. దానిని తీసుకొని ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది.అయితే అమ్మ, సోదరీ చావులు చూశాక నా జీవితం పూర్తిగా ముగిసిపోయిందనుకున్నాను. ఈ ప్రపంచానికి దూరంగా బ్రతకాలనుకున్నాను. ఎవరితో కూడా కనెక్షన్ పెట్టుకోకుండా బంధాలన్నీ తెంపుకొని ప్రాపంచిక జీవితానికి దూరంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాను.

సంతోషంగా ఉన్నాను.. భిక్షాటన కూడా చేస్తున్నాను.. అయితే అలా వచ్చిన డబ్బులో కొంత భాగం దేవుడికి ఇంకొంత భాగం నా గురువుకి ఇస్తాను. ఈ భిక్షాటన చేయడం వల్ల మనిషిలో గర్వం అనేది చచ్చిపోతుంది. ఇకపోతే ఆశ్రమానికి వచ్చేవాళ్లు కొన్ని బట్టలు ఇస్తారు. అందుకే నాలుగైదు జతల బట్టలతోనే నేను కాలం గడిపేస్తున్నాను. కొన్ని కొన్ని సార్లు మంచు తుఫాను వల్ల గుహలో కూడా జీవించాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నుపుర్ అలంకార్ విషయానికి వస్తే.. తెరపై ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి ప్రేక్షకులను మెప్పించే ఈమె శక్తిమాన్ తో సహా 150 కి పైగా సీరియల్స్ లో నటించింది. ఎక్కువగా గ్లామర్ పాత్రలు పోషించే ఈమె.. సడన్ గా అన్నింటికీ దూరమై ఇలా భిక్షాటన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని కొనసాగిస్తోంది.