Begin typing your search above and press return to search.

హృతిక్ సంగ‌తి స‌రే..తార‌క్ సంగ‌తేంటి?

ఇటీవ‌లే భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన `వార్ 2` అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   4 Oct 2025 4:12 PM IST
హృతిక్ సంగ‌తి స‌రే..తార‌క్ సంగ‌తేంటి?
X

ఇటీవ‌లే భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన `వార్ 2` అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిన సినిమా రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటే? ఊహించ‌ని ఫ‌లితాలు సాధించింది. తొలి షోతోనే సినిమాకు డిజాస్ట‌ర్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ఇదే సినిమాతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యాడు. కానీ వైఫల్యం తార‌క్ అభిమానుల్ని తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఈనేప‌థ్యంలో తాజాగా సినిమా వైఫ‌ల్యంపై హృతిక్ రోష‌న్ స్పందించారు.

క‌బీర్ పాత్ర‌లో న‌టించ‌డం త‌న‌కెంతో సర‌దాగా అనిపించింద‌న్నారు. ప్రాజెక్ట్ పై పూర్తి అవ‌గాహ‌న ఉండ‌టంతో క‌ష్ట‌మైనా ఇష్టంగా ప‌ని చేసాన‌న్నారు. కానీ దేనినైనా తేలిగ్గా తీసుకోవాల‌న్నారు. న‌టుడిగా బాధ్య‌త నూరు శాతం నెర‌వ‌ర్తించ‌డం త‌ప్ప అంత‌కు మించి తానేం చేయ‌లేన‌న్నాడు. షూటింగ్ స‌మ‌యంలో అయాన్ త‌న‌ని ఎంతో బాగా చూసుకున్నాడ‌ని వెల్ల‌డించారు. షూటింగ్ లో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదున్నారు. గాయాలు సైతం లెక్క చేయ‌కుండా ప‌ని చేసిన చిత్ర‌మిది అన్నారు. ప్ర‌శాంతంగా ప‌నిచేస్తే విజ‌యం దానంత‌టదే వ‌స్తుంద‌న్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై తార‌క్ స్పంద‌న ఏదైనా ఉంటుందా? అన్న‌ది చూడాలి. ఏ న‌టుడికైనా జ‌యాప‌జ‌యాలు స‌హ‌జం. అయితే ఈ సినిమా విష‌యంలో తార‌క్ స్పందిస్తాడా? లేదా? అన్న‌ది చూడాలి. బాలీవుడ్ లో తొలి సినిమా కాబ‌ట్టి త‌ప్ప‌క స్పందించే అవ‌కాశం ఉంటుంది. అయితే ఆ ఛాన్స్ ఇప్పుడే తీసుకుంటాడా? అందుకు ఏదైనా సినిమా వేదిక వినియోగించుకుంటాడా? అన్న‌ది చూడాలి. సాధారణంగా తార‌క్ సినిమా వేదిక‌ల‌పైనే సినిమాల గురించి మాట్లాడుతారు.

అది విమ‌ర్శ అయినా, ప్ర‌శంస అయినా , అభిమానుల‌కు ఇచ్చే సందేశ‌మైనా స‌రే సినిమా రిలీజ్ కు ముందు చేసే ఈవెంట్ల ద్వారానే వెళ్లాల‌నుకుంటారు. మ‌రి ఈసారి అంతవ‌ర‌కూ వెయిట్ చేస్తారా? ముందే ముందుకొస్తాడా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం తారక్ హీరోగా `డ్రాగ‌న్` అనే పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్నఈ చిత్రం షూటింగ్ లోనే తార‌క్ బిజీగా ఉన్నాడు.