2026 మిడ్ లో తారక్-త్రివిక్రమ్ !
మైథలాజికల్ కాన్సెప్ట్ కావడంతో? ఈ సినిమా కు కూడా తారక్ ఎక్కువగా డేట్లు కేటాయించాల్సి వస్తోందిట.
By: Srikanth Kontham | 22 Oct 2025 11:00 PM ISTఅన్ని అనుకున్నట్లు జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి. కానీ ఇండస్ట్రీలో లెక్కలు మారుతాయి గా. అదే లెక్క ఈ కాంబినేషన్ లోనూ మారింది. అనూహ్యంగా తారక్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కించడంతో? సీన్ మొత్తం మారింది. త్రివిక్రమ్ తెరకెక్కించాల్సిన మైథలాజికల్ చిత్రం వాయిదా పడింది. దీంతో గురూజీ ఈ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
`డ్రాగన్` ఓ కొలిక్కి వచ్చిన తర్వాత:
ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మిడ్ కల్లా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తారక్-గురూజీ ప్రాజెక్ట్ ఎప్పడు మొదలవుతుంది? అన్నది లీక్ అయింది. వెంకీ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే గురూజీ తో తారక్ సినిమా కూడా మొదలవుతుందన్నది తాజా సమాచారం. `డ్రాగన్` అప్పటికీ షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగింపు దశకే చేరుకుంటుంది. రిలీజ్ అయినా అవ్వకపోయినా? ఆ సినిమా రిలీజ్ తో సంబంధం లేకుండా గురూజీ సినిమాకు తారక్ డేట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
ఇప్పటికే మొదలైన ప్రిపరేషన్:
మైథలాజికల్ కాన్సెప్ట్ కావడంతో? ఈ సినిమా కు కూడా తారక్ ఎక్కువగా డేట్లు కేటాయించాల్సి వస్తోందిట. ఈ సిని మా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చే వరకూ మరో సినిమా మొదలు పెట్ట కూడాదని తారక్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాడుట. గురూజీ సినిమాకు సంబంధించి తారక్ ఇప్పటికే సన్నధం అవ్వడం మొదలు పెట్టాడు. `డ్రాగన్` షూటింగ్ తో సంబంధం లేకుండా పాత్ర పరంగా సిద్దమవ్వడం కోసం గురూజీ ఇచ్చిన పుస్తకాలు చదువుతోన్న సంగతి తెలిసిందే. పాత్రలో ఆత్మను పట్టుకునే ప్రక్రియలో భాగంగా తారక్ ముందొస్తు ప్రిపరేషన్ కనిపిస్తోంది.
గురూజీ నుంచి మినహాయింపు ఉంటుందా:
పాత్ర లుక్ పరంగా ఎలాంటి ట్రాన్సపర్మేషన్ అవసరం అవుతుంది? అన్నది జనవరి ముగింపు కల్లా గురూజీ సూచిస్తాడని వినిపిస్తోంది. మరి త్రివిక్రమ్ సిద్దం చేస్తన్న ప్రణాళిక పక్కాగా అమలవుతుందా? మధ్యలో ఏవైనా డిస్టబెన్సెస్ ఎదురవుతాయా? అన్నది అప్పటి సందర్భాన్ని బట్టి కనిపిస్తుంది. `డ్రాగన్` కోసం తారక్ లుక్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే. బాగా సన్నమయ్యాడు. భారీ యాక్షన్ చిత్రం కావడంతో? అదనంగా శ్రమించాల్సి వస్తోంది. మరి ఇలాంటి కసరత్తుల నుంచి గురూజీ మనిహాయింపు ఇస్తాడా? ఆయనా సానబెడతాడా? అన్నది చూడాలి.
