Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్, తారక్.. అనుకున్న రేంజ్ లో కంటెంట్ పడితే..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు టాలీవుడ్‌ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

By:  M Prashanth   |   7 May 2026 1:18 PM IST
త్రివిక్రమ్, తారక్.. అనుకున్న రేంజ్ లో కంటెంట్ పడితే..
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు టాలీవుడ్‌ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు రాబోతున్న కొత్త ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆ సినిమా గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే త్రివిక్రమ్ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత ఆ ప్రాజెక్ట్‌ పై పూర్తి దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో అభిమానులు వరుస అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్- తారక్ సినిమా నుంచి కూడా ఓ స్పెషల్ అప్డేట్ రానుందనే వార్తలు మరింత హైప్ తీసుకొస్తున్నాయి.

ఆ సినిమాకు గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా ఓ అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే సమాచారం ఇప్పుడు ఫ్యాన్స్‌ లో జోష్ ను నింపుతోంది. ఆ వీడియోలో సినిమా కాన్సెప్ట్‌ కు సంబంధించిన హింట్ లేదా ఎన్టీఆర్ లుక్‌ ను చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా ఆ వీడియోను త్రివిక్రమ్ చాలా గ్రాండ్‌ గా ప్లాన్ చేస్తున్నారట. హై విజువల్ ఎఫెక్ట్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌ డ్రాప్‌ తో వీడియోను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఇక ఆ చిత్రం మైథలాజికల్ టచ్‌ తో తెరకెక్కబోతుందనే గట్టిగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కుమారస్వామి నేపథ్యంతో కథ ఉండొచ్చనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎమోషన్స్, కన్వర్జేషన్స్, డివోషనల్ ఎలిమెంట్స్ ను స్ట్రాంగ్ గా చూపించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి దర్శకుడు మైథలాజికల్ జానర్‌ ను టచ్ చేస్తే అది ఓ రేంజ్ లో ఉండొచ్చనే అభిప్రాయం అభిమానుల్లో కనిపిస్తోంది.

అదే సమయంలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ ఫుల్ యాక్షన్ సినిమాకు మరింత బలం కానున్నాయి. ఎలాంటి పాత్రనైనా తన నటనతో మరో రేంజ్ కు తీసుకెళ్లగలిగే తారక్, దేవతా శక్తులు ఉన్న పాత్రలో కనిపిస్తే అభిమానులకు అది విజువల్ ఫీస్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ రైటింగ్‌ కు ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో భారీ రెస్పాన్స్ రావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఆ ప్రాజెక్ట్‌ పై వస్తున్న ప్రతి వార్త కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కంటెంట్ అనుకున్న స్థాయిలో పడితే మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మే 20న రానున్న అప్డేట్‌ తో ప్రాజెక్ట్‌ పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.