Begin typing your search above and press return to search.

గాడ్ ఆఫ్ వార్ లో ఆ క్రేజీ బ్యూటీ!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ తొలి పాన్ ఇండియా సినిమాపై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో? చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   20 July 2026 12:26 PM IST
గాడ్ ఆఫ్ వార్ లో ఆ క్రేజీ బ్యూటీ!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ తొలి పాన్ ఇండియా సినిమాపై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో? చెప్పాల్సిన ప‌నిలేదు. `డ్రాగ‌న్` విజ‌యం సాధిస్తే తార‌క్ పాన్ ఇండియా ఇమేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఈ నేప‌థ్యంలో ఆ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని గురూజీ గాడ్ ఆఫ్ వార్ చిత్రాన్ని తెర‌కెక్కించాల్సి ఉంటుంది. అందుకు అన్ని ర‌కాలుగా గురూజీ సిద్దంగానే ఉంటారు. ఇప్ప‌టికే సినిమా కాన్సెప్ట్ లీక్ అయింది. కార్తీకేయ స్వామి నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఆ పాత్ర‌కు సంబంధించి తార‌క్ ప్రిప‌రేష‌న్స కూడా మొద‌లు పెట్టేసాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ? ఎవ‌రు అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా చ‌ర్చకు రాలేదు. తార‌క్ ప్ర‌శాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉండ‌టం..త్రివిక్ర‌మ్ ఆద‌ర్శ కుటుంబం సినిమాతో త‌ల మున‌క‌లై ఉండ‌టంతో? గాడ్ ఆఫ్ వార్ కు సంబంధించిన విష‌యాలు పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ పేరు బలంగా వినిపిస్తోంది. ఇంత వ‌ర‌కూ కియారా- తార‌క్ కాంబినేష‌న్ ఏ సినిమా కోసం చేతులు క‌లిపింది లేదు. ఇదే తొలిసారి కావ‌డంతో? ఆస‌క్తిక‌రంగా మారింది. కియారాకు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది.

అమ్మ‌డు హీరోయిన్ గా న‌టిస్తోన్న `టాక్సిక్` విజ‌యం సాధిస్తే ఆ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. ఇవ‌న్నీ దృష్టి లో పెట్టుకునే గురూజీ కియారాకి ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రత్యేకత ఉంటుంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. కియారా అద్వాణీకి ఉన్న స్టార్ ఇమేజ్, ఎన్టీఆర్ స్థాయికి సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తార‌క్ ఈ సినిమా కోసం లుక్ .. మేనరిజమ్స్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

`గాడ్ ఆఫ్ వార్` అనేది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అవ్వ‌డంతో? ఇందులో ఎన్టీఆర్ పాత్ర సీరియస్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి పాత్రకు కియారా వంటి నటి తోడైతే ఆ సినిమా స్థాయి మరో రేంజ్‌కు వెళ్తుంది. ప్రస్తుతం కియారా అద్వాణీ కూడా సౌత్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కియారా ఎన్టీఆర్‌తో పనిచేయడం కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుందని భావిస్తోంది. కియారా ఈ ప్రాజెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తే? అది టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ కావడం ఖాయం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.