కనిపించకుండానే స్టార్ క్యామియో.. ఇదే కొత్త ట్రెండా?
కానీ ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించకుండానే, కేవలం స్టార్ హీరో వాయిస్‌తోనే సినిమాకు ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్ తీసుకురావడం కూడా కొత్త ట్రెండ్‌గా మారుతోందా అనే డిస్కషన్ టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారుతోంది
By: Sravani Lakshmi Srungarapu | 7 Sept 2026 1:15 PM ISTసినిమాలో స్టార్ హీరో కనిపిస్తే వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించకుండానే, కేవలం స్టార్ హీరో వాయిస్‌తోనే సినిమాకు ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్ తీసుకురావడం కూడా కొత్త ట్రెండ్‌గా మారుతోందా అనే డిస్కషన్ టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారుతోంది. ఒకప్పుడు వాయిస్ ఓవర్ అంటే కథను ఆడియన్స్ కు క్షకుడికి పరిచయం చేసే రెగ్యులర్ సాధారణ నరేషన్ మాత్రమే. కానీ ఇప్పుడు స్టార్ హీరో గొంతు వినిపిస్తే అది కూడా ఒక రకమైన క్యామియో ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విషయంలో కూడా ఇదే ఆసక్తికరమైన అంశం డిస్కషన్‌కు వస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినిపించనున్నట్లు సమాచారం. అంటే ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపించకపోయినా, ఆయన గొంతు మాత్రం సినిమా ప్రపంచంలో ప్రేక్షకుడిని భాగస్వామిని చేయబోతోంది. ఇదే ఇప్పుడు కొత్త తరహా స్టార్ క్యామియోగా మారుతోందా అనే ప్రశ్నకు కారణమవుతోంది.
నిజానికి స్టార్ హీరోను క్యామియో కోసం సినిమాలో తీసుకోవడం అంటే షెడ్యూల్స్, కథలో క్యారెక్టర్ కు సరైన వెయిట్, షూటింగ్ టైమ్ వంటి అనేక అంశాలుంటాయి. కానీ వాయిస్ ఓవర్ విషయంలో ఆ సమస్యలు చాలా వరకు ఉండవు. అదే సమయంలో స్టార్ పేరు సినిమాకు ఎక్స్‌ట్రా బజ్‌ను తీసుకురాగలదు. ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచడంతో పాటు, థియేటర్‌లో ఆ గొంతు మొదటిసారి వినిపించినప్పుడు వచ్చే రెస్పాన్స్ కూడా సినిమాకు స్పెషల్ ఎనర్జీని ఇవ్వొచ్చు.
ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం క్రాస్- ఫ్యాన్‌బేస్. వెంకటేష్ సినిమాను చూడటానికి వచ్చే ఆడియన్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ పేరు ప్రమోషన్స్‌లో డిస్కషన్‌కు రావడం ద్వారా సినిమాకు సోషల్ మీడియా స్థాయిలో కూడా మరింత రీచ్ లభించొచ్చు. ఇది నేరుగా స్టార్ కాంబినేషన్ కాకపోయినా, ఇద్దరు స్టార్‌ల ఫ్యాన్స్ ను ఒకే సినిమా గురించి మాట్లాడుకునేలా చేసే సాఫ్ట్ ప్రమోషనల్ స్ట్రాటజీగా పనిచేయవచ్చు. చూస్తుంటే ఫ్యూచర్‌లో స్టార్ క్యామియోలతో పాటు స్టార్ వాయిస్ ఓవర్లు కూడా సినిమాల ప్రమోషన్, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌లో కొత్త ఆయుధంగా మారతాయేమో చూడాలి.
