Begin typing your search above and press return to search.

నీల్ ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాడా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడ‌దే చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ ఎలా ఉండేవారో అంద‌రికీ తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Nov 2025 10:24 AM IST
నీల్ ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాడా?
X

చూడ‌టానికే రంగుల ప్ర‌పంచం కానీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ స్టార్ గా ఉండాలంటే దానికి త‌గ్గ కృషి ఎల్ల‌ప్పుడూ చేస్తూనే ఉండాలి. అందులోనూ స్టార్ హీరో అయితే ఆ క‌ష్టం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫిట్‌నెస్ ను మెయిన్ టెయిన్ చేయ‌డంతో పాటూ తమ సినిమాల కోసం మేకోవ‌ర్ అవాల్సి ఉంటుంది. అలా అని మేకోవ‌ర్ ఎలా ప‌డితే అలా అవుదామంటే అదీ కుద‌ర‌దు. దాన్ని ఆడియ‌న్స్ కూడా యాక్సెప్ట్ చేయ‌గ‌ల‌గాలి.

ఈ నేప‌థ్యంలో ఏ హీరో అయినా స‌రే ఎప్ప‌టిలా కాకుండా లుక్ లో చిన్న మార్పు క‌నిపించినా అది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ఈ ట్రాన్సర్ఫ్మేష‌న్ విష‌యంలో కొంద‌రు సేఫ్ గా ఉండాల‌నుకుంటే, మ‌రికొంద‌రు మాత్రం తాము చేసే సినిమాలోని పాత్ర కోసం త‌మ‌ను తాము ఎలాగైనా మార్చుకోవ‌డానికి రెడీ అవుతారు. ఈ జ‌ర్నీలో వారి లుక్ పై ట్రోలింగ్ జ‌రిగినా, ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా వాటిని ప‌ట్టించుకోరు.

ప‌లు సినిమాల కోసం మేకోవ‌ర్ అయిన ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడ‌దే చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ ఎలా ఉండేవారో అంద‌రికీ తెలిసిందే. రాఖీ సినిమాలో చాలా లావుగా క‌నిపించిన ఎన్టీఆర్ త‌ర్వాత య‌మదొంగ సినిమా కోసం చాలా స్లిమ్ గా మారి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆ త‌ర్వాత అర‌వింద స‌మేత కోసం సిక్స్ ప్యాక్ లో అవ‌తార‌మిచ్చి షాకిచ్చిన తార‌క్, ఆర్ఆర్ఆర్ లో కండ‌లు తిరిగిన దేహంతో క‌నిపించి మెప్పించారు.

60 కేజీల బ‌రువు త‌గ్గిన తార‌క్

వీట‌న్నింటినీ బ‌ట్టి చూస్తుంటేనే ఎన్టీఆర్ సినిమాలోని పాత్ర కోసం ఎంత క‌ష్ట‌ప‌డ‌తార‌నేది అర్థం చేసుకోవ‌చ్చు. ఇక అస‌లు విష‌యానికొస్తే ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగ‌న్ కోసం కూడా మేకోవ‌ర్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌నంత స్లిమ్ గా మారారు ఎన్టీఆర్. ఏకంగా 60 కేజీల బ‌రువు త‌గ్గి, చాలా స‌న్న‌గా మారారు. దీనికోసం తార‌క్ రోజుకు ఒక సారి మాత్ర‌మే భోజ‌నం తీసుకుంటూ వ‌చ్చార‌ని స‌మాచారం. ఎన్టీఆర్ ను కాస్త బొద్దుగా చూడ‌టం అల‌వాటైన ప్రేక్ష‌కుల‌కు, ఫ్యాన్స్ కు ఈ లుక్ పెద్ద‌గా న‌చ్చ‌ద‌ని తెలిసిన‌ప్ప‌టికీ తార‌క్, నీల్ పై న‌మ్మ‌కంతో సినిమా కోసం చాలానే ఎఫ‌ర్ట్స్ పెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నీల్ నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆర్ఆర్ఆర్, దేవ‌ర త‌ర్వాత తార‌క్ తో సినిమాలు చేద్దామ‌ని ఎంతో మంది ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ తార‌క్, నీల్ ను న‌మ్మి త‌న ప్రాజెక్టును ఒప్పుకున్నారు. డ్రాగ‌న్ తో సూప‌ర్ హిట్ కొట్ట‌డ‌మే కాకుండా, హీరోను నెవ‌ర్ బిఫోర్ లుక్ లో ప్రెజెంట్ చేసి, ఆడియ‌న్స్ ను ఫ్యాన్స్ ను మెప్పించి, తార‌క్ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితాన్ని అందించాల్సిన బాధ్య‌త ఇప్పుడు నీల్ పైనే ఉంది. ఎన్టీఆర్ కెరీర్లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా మ‌రి ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి. రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.