ఎన్టీఆర్- నీల్ సినిమాలో మరో స్టార్ హీరో?
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు, క్రేజ్, స్టార్‌డమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నింటినీ భారీ స్థాయిలోనే చేసుకుంటూ వస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Sept 2025 10:02 AM ISTఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు, క్రేజ్, స్టార్‌డమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నింటినీ భారీ స్థాయిలోనే చేసుకుంటూ వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర1తో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్, రీసెంట్ గా వార్2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ వార్2 సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు.
కర్ణాటకలో తారక్ కు ఫ్యాన్స్
కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కెజిఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా కర్ణాటకలోనే జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు దేశం మొత్తం ఫ్యాన్స్ ఏర్పడగా, కర్ణాటకలో అతనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. తారక్ కు కన్నడ మూలాలు కూడా ఉండటం వల్ల ఆయన కన్నడలో కూడా తెలుగులో లాగానే అద్భుతంగా మాట్లాడగలరు.
డ్రాగన్ లో రిషబ్ శెట్టి?
డ్రాగన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాతో కన్నడ ఆడియన్స్ కు మరింత దగ్గరవాలని ఎన్టీఆర్ ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఓ కన్నడ స్టార్ ను నటింపచేయాలని చూస్తున్నారట తారక్. ఆ హీరో మరెవరో కాదు, కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో రిషబ్ శెట్టి ఓ గెస్ట్ రోల్ చేయనున్నారని శాండిల్‌వుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఎన్టీఆర్ తో రిషబ్ కు ఫ్రెండ్‌షిప్
ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ ఉందని, ఆ రోల్ కోసం ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టిని సంప్రదించారని, ఫ్లాష్ బ్యాక్ లో రిషబ్ శెట్టి కనిపించనున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ తో తనకున్న ఫ్రెండ్‌షిప్ కారణంగా రిషబ్ కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి డ్రాగన్ స్క్రిప్ట్ ను ప్రశాంత్ నీల్ చాలా కొత్తగా రాసుకున్నారని తెలుస్తోంది.
భారీగా పెరుగుతున్న అంచనాలు
కాగా ఈ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నారు. తన కెరీర్లో మునుపెన్నడూ చూడని విధంగా చాలా స్లిమ్ గా మారారు. ఎన్టీఆర్ కెరీర్లోనే డ్రాగన్ ను ది బెస్ట్ గా నిలపాలని ప్రశాంత్ నీల్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో అనిల్ కపూర్, టొవినో థామస్ నటిస్తుండగా ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా నటిస్తున్నారని తెలియడంతో డ్రాగన్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
