ఎన్టీఆర్ రిస్క్.. ఫ్యామిలీకి కూడా చెప్పలేదా?
అసలు విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ కానుంది.
By: M Prashanth | 1 Dec 2025 10:00 PM ISTసినిమా కోసం ప్రాణం పెట్టడం అంటే ఇదేనేమో. పాత్ర నచ్చితే దాని కోసం స్టార్ హీరోలు ఎంతటి రిస్క్ కైనా వెనకాడరు. కొన్నిసార్లు తెరపై మనం చూసే అద్భుతాల వెనుక హీరోల కష్టం, వారు చేసే రిస్క్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మన టాలీవుడ్ యంగ్ టైగర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. త్వరలో మొదలుకాబోయే ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం చూసి ఇండస్ట్రీ వర్గాలే షాక్ అవుతున్నాయి.
సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్, ఛేజింగ్ సీన్స్ ఉంటే బాడీ డూప్స్ ను వాడటం కామన్. హీరోలకు చిన్న గాయం అయినా షూటింగ్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి, రిస్క్ ఎందుకులే అని దర్శకనిర్మాతలు కూడా సేఫ్ గేమ్ ఆడుతుంటారు. కానీ ఇప్పుడు వరల్డ్ సినిమా ట్రెండ్ మారింది. ఆడియెన్స్ కు రియాలిటీ చూపించాలనే తపన హీరోల్లో పెరిగింది. సరిగ్గా ఈ పాయింట్ మీదే మన హీరో ఇప్పుడు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు.
అసలు విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ కానుంది. ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ గత చిత్రాలకంటే చాలా భిన్నంగా, ప్రమాదకరంగా ఉంటాయట. అయితే ఈ ఫైట్స్ కోసం ఎలాంటి బాడీ డూప్ ను వాడకూడదని ఎన్టీఆర్ గట్టిగా డిసైడ్ అయ్యారట. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ లాగా, ప్రతి స్టంట్ ను స్వయంగా తానే చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు మూడు వారాల పాటు రాత్రి వేళల్లో ఈ షూటింగ్ జరగనుంది. ఇవి ఎన్టీఆర్ కెరీర్ లోనే మోస్ట్ డేంజర్ స్టంట్స్ అని, చాలా రాకింగ్ గా ఉంటాయని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ స్టార్లే ఇప్పుడు సొంతంగా ఫైట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే, తారక్ కూడా తగ్గేదేలే అంటూ పూర్తిగా బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.
ఇక్కడ మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. తను చేయబోయే స్టంట్స్ ఎంత ప్రమాదకరమైనవో ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదట. ఇంట్లో వాళ్లు అనవసరంగా టెన్షన్ పడతారని, వారిని కంగారు పెట్టడం ఇష్టం లేక ఈ నిజాన్ని దాచారని టాక్ వినిపిస్తోంది. కేవలం సినిమా అవుట్ పుట్ బెస్ట్ గా రావాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ రేంజ్ రిస్క్ తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ కానున్నాయి.
దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై పాన్
ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్ డెడికేషన్, రియల్ స్టంట్స్ గురించి బయటకు వచ్చిన ఈ న్యూస్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరో సంచలనం ఖాయంలా కనిపిస్తోంది. మరి ఈ సాహసాలు వెండితెరపై ఏ రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పిస్తాయో చూడాలి.
