NTRNeel : సంక్రాంతికి గిఫ్ట్ కన్ఫర్మ్, ఇదే సాక్ష్యం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఆగి చాలా నెలలు అవుతోంది.
By: Ramesh Palla | 6 Dec 2025 3:04 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఆగి చాలా నెలలు అవుతోంది. ఒకానొక సమయంలో ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా సినిమా అటకెక్కిందని, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో హీరో ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో విభేదించడం వల్ల సినిమా ఆగిపోయింది అంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి. చిత్ర యూనిట్ సభ్యులు, సినిమాకు సంబంధం లేని కొందరు కూడా ఎన్టీఆర్-నీల్ సినిమా ఆగిందనే వార్తలను కొట్టిపారేస్తూ వచ్చారు. అయినా కూడా అభిమానుల్లో ఎక్కడో ఒక చిన్న టెన్షన్ అనేది కనిపిస్తూ వచ్చింది. సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. షూటింగ్ ఆలస్యం అవుతుంది కనుక సమ్మర్ విడుదల చేస్తామని అన్నారు. ఇప్పుడు షూటింగ్ చేయకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అంటూ అభిమానులు జుట్టు పీక్కున్నారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో...
ప్రశాంత్ నీల్ ఏ సినిమా చేసినా కూడా షూటింగ్ సగం పూర్తి చేసిన తర్వాత మిగిలిన సగంకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేయడంకు కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ మాత్రమే ఇది కానీ, సినిమా పూర్తిగా ఆగిపోయింది అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని కొందరు చెబుతూ వచ్చారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ సైతం ఈ విషయాన్ని గురించి ప్రముఖంగా ప్రచారం చేయడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా అంటే చాలా ఆశలు పెట్టుకుని, వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తామని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అప్‌డేట్ అందుతోంది. ఎట్టకేలకు సినిమా షూటింగ్ పునఃప్రారంభం కాబోతుంది. మేము గతంలో చెప్పినట్లుగానే ఈ సినిమాను డిసెంబర్ లో రీ స్టార్ట్ చేయబోతున్నారు.
భారీ యాక్షన్ సీన్ కోసం ఎన్టీఆర్ రెడీ...
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 8 నుంచి ఒక భారీ సెట్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ చేయబోతున్నారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ పదుల సంఖ్యలో ఫైటర్స్‌తో ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వర్క్ షాప్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్టులు, డైరెక్షన్ టీం ప్రస్తుతం అక్కడ ఉన్నారని సమాచారం అందుతోంది. యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నీల్ సినిమాలు పెట్టింది పేరు అనే విషయం తెల్సిందే. అందుకే ఈ ఫైట్ ను అంతకు మించి అన్నట్లుగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
సంక్రాంతికి ఎన్టీఆర్ గిఫ్ట్ కన్ఫర్మ్
సినిమా ఆగిపోయింది, విభేదాలు అంటూ పుకార్లు పుట్టించిన వారికి చెంప పెట్టు అన్నట్లుగా ఈ డిసెంబర్ 8న షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే సమయంలో యూనిట్ సభ్యుల నుంచి ఆఫ్ ది రికార్డ్ ఆసక్తికర అప్‌డేట్ అందుతోంది. అదేంటి అంటే ఈ సినిమాను మొదట 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని అన్నారు, కానీ ఆ సమయంకు విడుదల చేయడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేయకుండా సినిమా నుంచి ఇంట్రస్టింగ్ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ వీడియో కాకుంటే కనీసం పోస్టర్‌తో అయినా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలని ప్రశాంత్ నీల్ టీం భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అదే కనుక జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంక్రాంతికి పెద్ద బహుమానం అదే అవుతుంది. డిసెంబర్ 8న షూటింగ్ ప్రారంభం కాబోతుంది కనుక సంక్రాంతికి గిఫ్ట్ ఖాయం అని, ఇదే సాక్ష్యం అన్నట్లుగా మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
