ఎన్టీఆర్- నీల్.. అసలు డౌట్ తీరేదెప్పుడు?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హై యాక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 27 Nov 2025 2:12 PM ISTటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హై యాక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా.. అప్పటి నుంచి గ్యాప్ లేకుండా చిత్రీకరణను నిర్వహిస్తున్నారు మేకర్స్. ఆ మధ్యకు ఎన్టీఆర్ కు చిన్న గాయవ్వడం వల్ల బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను జరుపుతున్నారు. కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అక్కడ భారీ సీన్స్ ను షూట్ చేయనున్నారట.
అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో అదిరిపోయే అవుట్ పుట్ వస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా మూవీ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా అప్డేట్స్ కోసం కూడా ఈగర్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
అందులో ముఖ్యంగా టైటిల్ కోసం. ఎందుకంటే డ్రాగన్ అనే పేరును మేకర్స్ ఫిక్స్ చేశారని ఇప్పటికే అంతా ఫిక్స్ అయ్యారు. తొలుత సినీ వర్గాల్లో టాక్ వినిపించినా.. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో రాజమౌళి డ్రాగన్ పేరు చెబుతూనే మూవీ కోసం మాట్లాడారు. దీంతో అంతా అదే ఫిక్స్ అయిందని కంప్లీట్ గా డిసైడ్ అయిపోయారు.
దానికి తోడు టైటిల్ పవర్ ఫుల్ గా ఉండడంతో.. ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేయలేదని ఆ నిర్మాత రవిశంకర్ తెలిపారు. చాలా పేర్లు తమ పరిశీలనలో ఉన్నాయని, తాము పరిశీలిస్తున్న కొన్ని టైటిల్స్ లో డ్రాగన్ ఒకటి మాత్రమే అని ఆయన వెల్లడించారు.
మరికొద్ది రోజుల్లో ఓ ఈవెంట్ ను నిర్వహించి టైటిల్ ను రివీల్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పుడు తారక్- నీల్ మూవీ టైటిల్ డ్రాగన్ ఫిక్స్ కాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అవుతున్నారు. అయితే కొత్త టైటిల్ ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ ను పెడుతున్నారో మేకర్స్ కే తెలియాలి. ముఖ్యంగా ఇప్పుడు డ్రాగన్ కాకుండా వేరే పేరు ఫిక్స్ చేస్తే.. ఆడియన్స్ లో అంతే రేంజ్ లో హీట్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి.
