డ్రాగన్ కోసం భారీ ఫారెస్ట్ ను సెట్ చేసిన నీల్
అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఇమేజ్ ఉండటంతో డ్రాగన్ పై మొదటినుంచి మంచి బజ్ నెలకొంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jan 2026 6:13 PM ISTకెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఇమేజ్ ఉండటంతో డ్రాగన్ పై మొదటినుంచి మంచి బజ్ నెలకొంది.
డ్రాగన్ కోసం స్లిమ్ గా మారిన ఎన్టీఆర్
ఈ మూవీ కోసం ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్ అయి, చాలా స్లిమ్ గా స్టైలిష్ గా కనిపిస్తుండగా, డ్రాగన్ సినిమాను తారక్ కెరీర్లోనే గుర్తుండిపోయే విధంగా నిలపాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపిస్తారని వస్తున్న వార్తలు డ్రాగన్ పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.
సరైన అప్డేట్స్ లేక నిరాశలో ఫ్యాన్స్
అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులైనప్పటికీ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ను కాస్త నిరాశ పరుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా గురించి ఓ కొత్త అప్డేట్ వినిపిస్తోంది. డ్రాగన్ మూవీ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఫారెస్ట్ సెట్ ను నిర్మించి, ఆ సెట్ లో దాదాపు 100 మందితో ఓ భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేశారని తెలుస్తోంది.
పండగ తర్వాత నెక్ట్స్ షెడ్యూల్
డ్రాగన్ కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత మొదలవనుందని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను మేకర్స్ చాలా వేగవంతం చేశారు. హీరోయిన్ రుక్మిణి కూడా షూటింగ్ లో జాయిన్ అవడంతో షూటింగ్ వేగం పెరిగిందని తెలుస్తోంది. కాగా డ్రాగన్ కోసం మేకర్స్ విదేశాల్లో కీలక భాగాల షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట. దానికోసం సినిమాటోగ్రాఫర్ ఇప్పటికే జోర్డాన్ వెళ్లి అక్కడి లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. మొత్తానికి అసలు డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతుందా లేదా అని అనుమానంలో ఉన్న ఆడియన్స్ కు ఈ అప్డేట్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
