ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మాస్ అలర్ట్!
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
By: Tupaki Entertainment Desk | 23 Dec 2025 9:00 PM ISTటాలీవుడ్‌లో సెట్స్‌పై ఉన్న సినిమాల్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్‌గా నిలుస్తున్న మూవీ `డ్రాగన్` (టైటిల్ ఇంకా కఫర్మ్ కాలేదు). యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల తొలి కాంబనేషన్‌లో ఈ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. `కాంతార 2` ఫేమ్ రుక్మిణీ వాసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని ఈ ఏడాది ప్రారంభంలో మొదలు పెట్టారు.
`దేవర`, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆలోచనలో పడిన ఎన్టీఆర్ ఈ మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు. అందులో ఇందులో నెవర్ బిఫోర్ అనే స్థాయి క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ స్టోరీ డిమాండ్ మేరకు భారీ స్థాయిలో బరువు తగ్గిన ఎన్టీఆర్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.
ఇప్పటి వరకు కర్ణాటకలోని కీలక ప్రదేశాలతో పాటు విదేశాల్లోనూ కీలక ఘట్టాలని చిత్రీకరించారు. ఇదొక ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్. ఎన్టీఆర్ నేపథ్యంలో వచ్చే హైఓల్టేజ్ యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట. 1969 కాలంలో చైనా, భూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకొస్తున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా సాగనుందట.
అంతే కాకుండా ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. తాజా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీలోకి మదర్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ కాజోల్ దించుతున్నారని తెలిసింది. `కేజీఎఫ్` కోసం ఐరన్ లేడీ ఇందిరా గాంధీ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ రవీనాటాండన్‌ని రంగంలోకి దించి అందరిని ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ మూవీ కోసం కాజోల్‌ని నమ్ముకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం షూటింగ్ మళ్లీ పుల్ స్పీడ్‌లో సాగుతున్న నేపథ్యంలో ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులకు ఓ మాస్ అలర్ట్‌గా మారింది. అంతే కాకుండా ఇందులో మలయాళ స్టార్ టొవినో థామస్ కూడా కీలక పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కాజోల్, ,టొవినో థామస్ యాడ్ అయ్యారంటే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా హిట్టు కోసం సింహ గర్జనకు రెడీ అవుతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో వచ్చే ఏడాది బాక్సాఫీస్ ని ఏ స్థాయిలో షేక్ చేస్తాడో.. ఎలాంటి రికార్డుల్ని సృష్టిస్తాడో తెలియాలంటే వచ్చేఏడాది జూన్ 25 వరకు వేచి చూడాల్సిందే.
