Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 'LUGER' అర్థం ఏంటో తెలుసా?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Madhu Reddy   |   20 May 2026 4:31 PM IST
ఎన్టీఆర్ LUGER అర్థం ఏంటో తెలుసా?
X

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేశారో అప్పటినుంచి 'ఎన్టీఆర్ నీళ్ ' మూవీ అంటూ అభిమానులు తెగ సందడి చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి తెగ వైరల్ చేసిన విషయం తెలిసిందే. అయితే చిత్ర బృందం తాజాగా అభిమానులు వైరల్ చేసిన పేరుని సినిమాకి టైటిల్ గా ఫిక్స్ చేశారు.

ఈ మేరకు ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుండి సుమారుగా 4:28 నిమిషాల నిడివితో సినిమా కాస్ట్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ అభిమానులకు మంచి విందు భోజనంలా అనిపించింది. ఇకపోతే ఇందులో ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారు అనే విషయాన్ని రివీల్ చేయడమే కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ 'లూగర్' అనే పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇక దీంతో ఈ లూగర్ అంటే ఏంటి? దీని వెనుక ఏదైనా స్టోరీ ఉందా ? అసలు లూగర్ అనే పదానికి అర్థం ఏంటి ? అంటూ అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా గూగుల్లో వెతకడం మొదలుపెట్టేశారు.

అయితే గూగుల్ ప్రకారం లూగర్ అనేది జర్మన్ 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్. ఇది రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జర్మన్ సైన్యానికి ప్రామాణిక సర్వీస్ పిస్టల్ గా ఉండేది. అయితే సినిమాకు సంబంధించిన ఈ పేరుకు గల అర్థం ఏమిటో మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా గూగుల్లో దీని అర్థం ఇలా ఉన్నా.. మరి ఎన్టీఆర్ పాత్రకు పెట్టిన ఈ పేరు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చిత్ర బృందం రిలీజ్ చేస్తే తప్ప తెలియదనే చెప్పాలి.

ఇకపోతే విడుదల చేసిన గ్లింప్స్ లో ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారు అనే విషయాని కొస్తే ఎన్టీఆర్ ఈ సినిమాలో లూగర్ అనే పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా మజిల్డ్ బాడీతో సన్నగా కనిపిస్తూ తన లుక్కుతో అందర్నీ మెస్మరైజ్ చేశారు. పైగా ఆయన లుక్ ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది.. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ ఇండియాలో నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

ఆఫ్గన్ ట్రేడింగ్ కంపెనీకి బాస్ దాదా సర్కార్ పాత్రలో అశుతోష్ రాణా నటిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్స్(ఏటీసీ) హెడ్ జలీల్ రెహమాన్ పాత్రలో మలయాళీ నటుడు బిజూ మీనన్ నటిస్తున్నారు. ఏటీసీ సెకండ్ కమాండ్ సుజోయ్ సర్కార్ పాత్రలో అన్షుమన్ పుష్కర్ నటిస్తున్నారు. ఏటీసీ వజీర్ బాబి సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా నటిస్తున్నారు. ఏటీసీ అకౌంటెంట్ పాత్రలో గురు సోమ సుందరం నటిస్తుండగా.. రష్యాలో డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను చూసే విక్టర్ మెంస్కోవ్ అలెగ్జాండర్ మీజీవ్ నటిస్తున్నారు. ఇలా పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు.