ప్రశాంత్ నీల్ తగ్గేదేలే.. డ్రాగన్ హై రేంజ్ లోనే
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ బాక్సాఫీస్ కు కేజీఎఫ్ సినిమాలు, సలార్ ప్రాజెక్ట్ లు అందించారు.
By: M Prashanth | 12 Sept 2025 7:00 AM ISTప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ బాక్సాఫీస్ కు కేజీఎఫ్ సినిమాలు, సలార్ ప్రాజెక్ట్ లు అందించారు. ఈ సినిమాలతో ఆయన సత్తా పాన్ఇండియా రేంజ్ లో అందరికీ తెలిసింది. ఈ ప్రాజెక్ట్ లతో ప్రశాంత్ ఇండియా వైడ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సలార్ సినిమాతో మెగా సక్సెస్ అందుకున్న ప్రశాంత్.. అప్ కమింగ్ సినిమా డ్రాగన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ రీసెంట్ సినిమా వార్ 2 బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యింది.
వార్ 2 బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా బడ్జెట్‌ను తగ్గించడం లేదు. ఈ హై- ఆక్టేన్, భారీ బడ్జెట్ యాక్షన్ గా సినిమాను తీసుకురావడానికే దర్శకుడు ప్రశాంత్ నీల్ కమిట్ అయ్యి ఉన్నాడు. వార్ 2 ఫెయిల్యూర్ తన సినిమా డ్రాగన్ మార్కెట్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ప్రశాంత్ నీల్ నమ్మకంగా ఉన్నాడు.
అద్భుతమైన పోరాట సన్నివేశాలు, ఉత్కంఠ భరితమైన విజువల్స్ , భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలు దశల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తైంది. హీరో ఎన్టీఆర్ పై కూడా కీలక పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. ఇక రెగ్యులర్ గా షూటింగ్ చేసి వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు.
కాగా, ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కెరీర్ లో ఇది భారీ ప్రాజెక్ట్ గా రూపొందనుంది. డ్రాగన్ లో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. మరే ఇతర నటీనటుల గురించి మేకర్స్ వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే అవన్నీ అధికారికంగా బయటకు రానున్నాయి. 2026 జూన్ 25న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్ లలోకి రానుంది.
