Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ శక్తి.. వెనకేం జరిగింది..?

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మెహెర్ రమేష్ శక్తి వెనక జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

By:  Ramesh Boddu   |   18 Aug 2025 9:41 AM IST
ఎన్టీఆర్ శక్తి.. వెనకేం జరిగింది..?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కింది. మెహెర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాను వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు. అప్పటికే కంత్రితో ఎన్టీఆర్ కి మంచి సక్సెస్ ఇచ్చాడు మెహెర్ రమేష్. ఐతే శక్తి సినిమా కథ తాను చెప్పినప్పుడు తారక్ ఎగ్జైట్ అయ్యాడని అన్నారు. వైజయంతి బ్యానర్ లో అశ్వని దత్ ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారు. ఐతే కథ విన్నాక దీనిలో డివోషనల్ పాయింట్ పెడితే ఇంకా బాగుంటుందని అశ్వని దత్ గారు అన్నారు.

శక్తి ఇంట్రెస్టింగ్ విషయాలు..

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మెహెర్ రమేష్ శక్తి వెనక జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. తను రాసుకున్న కథలో డివోషనల్ పాయింట్ అంటూ భారవి, యండమూరి వీరేంద్రనాద్, సత్యానంద్ లాంటి వారిని స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేయించారు. తను అనుకున్న శక్తి కథ వేరు.. కానీ డివోషనల్ గా మార్చాలని వీళ్లందరు జాయిన్ అయ్యారు. అప్పటికీ తనకు డౌట్ వచ్చి అశ్వనిదత్ గారిని అడిగితే శక్తి అంటే అమ్మ వారు ఏం పర్లేదు బడ్జెట్ గురించి ఆలోచించొద్దు అని అన్నారని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.

తాను రాసుకున్న కథను శక్తి సినిమాగా ఒక 20, 25 కోట్లతో తీయాలని అనుకున్నా కానీ అందులో మిగతా ఎలిమెంట్స్ యాడ్ అయ్యే సరికి బడ్జెట్ ఎక్కువైంది. ఐతే ఇప్పటికీ కూడా శక్తి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్, సినిమా క్వాలిటీ, సాంగ్స్ ఇవన్నీ ప్రత్యేకంగా ఉంటాయని అన్నారు మెహెర్ రమేష్.

బిగెస్ట్ లాస్ ప్రాజెక్ట్..

శక్తి సినిమా టాపిక్ వస్తే చాలు అశ్వనిదత్ గారు భారీ లాసుల గురించి ప్రస్తావిస్తారు. తన కెరీర్ లో బిగెస్ట్ లాస్ ప్రాజెక్ట్ లో శక్తి ఒకటని ఆయన చాలాసార్లు చెప్పారు. ఆ రోజుల్లోనే 40 కోట్ల దాకా భారీ లాస్ అని అశ్వనిదత్ చెబుతుంటారు.

ఐతే తను రాసుకున్న కథ వేరు నిర్మాత దానిలో డివోషనల్ సబ్జెక్ట్ యాడ్ చేయడం వల్లే ఫైనల్ గా అలా వచ్చిందని అంటున్నాడు మెహెర్ రమేష్. ఏది ఏమైనా శక్తి సినిమా ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. 2011 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యింది. మెహెర్ రమేష్ తర్వాత షాడో, భోళా శంకర్ ఇలా వరుస ఫ్లాపులు తీస్తూనే ఉన్నారు.