ఎన్టీఆర్ లుక్.. వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ కోసమేనా..?
ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ డ్రాగన్ కి హైలెటెడ్ థింగ్స్ గా చెప్పుకుంటున్నారు. ఈమధ్య ఎన్టీఆర్ బయట ఈవెంట్స్ లో కనిపించాడు.
By: Ramesh Boddu | 12 Oct 2025 4:00 PM ISTదేవర, వార్ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ స్టామినా తెలిసిన ప్రశాంత్ నీల్ ఈసారి ఏమాత్రం అంచనాలు తగ్గకుండా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేస్తున్నారట. అది అలా ఇలా కాదు వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ అని టాక్. అందులో ఎన్టీఆర్ లుక్, యాక్షన్ అన్నీ కూడా వేరే లెవెల్ అని టాక్.
ఎన్టీఆర్ గడ్డం లుక్..
ఐతే ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఈమధ్య గుబురు గడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు అందుకోసమేనా అంటూ ఆరా తీస్తున్నారు. ఎన్టీఆర్ ఈ లుక్ అయితే డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐతే పూర్తి మేకప్ సెటప్ తో అది అదిరిపోతుందని అంటున్నారు. త్వరలోనే ఆ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన ఎపిసోడ్స్ షూట్ చేస్తారట. ఆ లుక్ లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అన్నది ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.
ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ డ్రాగన్ కి హైలెటెడ్ థింగ్స్ గా చెప్పుకుంటున్నారు. ఈమధ్య ఎన్టీఆర్ బయట ఈవెంట్స్ లో కనిపించాడు. మొన్న కాంతారా ఈవెంట్ లో ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. గడ్డం లుక్ తో ఎన్టీఆర్ బ్యాక్ స్టోరీ ఏంటా అని డౌట్ పడ్డారు. ఐతే అదంతా డ్రాగన్ ప్రశాంత్ నీల్ ప్లానింగ్ లో భాగమే అని తెలుస్తుంది. డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ప్రశాంత్ నీల్ బాగా ప్రయత్నిస్తున్నాడు.
సలార్ 1 తర్వాత ప్రశాంత్ నీల్..
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అమ్మడు నటించడం ఆమె ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. కె.జి.ఎఫ్ రెండు భాగాలు, సలార్ 1 తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ డ్రాగన్ మీద ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఎన్టీఆర్ రగ్డ్ లుక్ తో కనిపిస్తాడని తెలిసి ఫ్యాన్స్ మరింత క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లానింగ్ ఉన్న ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ప్లానింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ప్రశాంత్ నీల్ నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడతాడా లేదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.
