Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మేకోవర్: అసలు ప్లాన్ ఏంటి?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

By:  M Prashanth   |   22 Nov 2025 9:23 AM IST
ఎన్టీఆర్ మేకోవర్: అసలు ప్లాన్ ఏంటి?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే, నటనతో పాటు హీరోల లుక్స్ కూడా ఫ్యాన్స్ కు చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఫిజికల్ అప్పీయరెన్స్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఆయన మునుపటి కంటే కాస్త ఎక్కువ బరువు తగ్గి స్లిమ్ గా మారడం కొందరికి నచ్చితే, మరికొందరికి మాత్రం రుచించలేదు.




'దేవర' తర్వాత ఎన్టీఆర్ చాలా సన్నబడటంతో, ఆయన ముఖంలో ఉండే ఆ సహజమైన కళ తగ్గిపోయిందని, మరీ బక్కగా కనిపిస్తున్నారని కామెంట్స్ వచ్చాయి. హీరో అంటే కాస్త కండలు తిరిగి, మాస్ గా ఉండాలని కోరుకునే ఫ్యాన్స్ ఆ లుక్ ని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. లేటెస్ట్ గా బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఫోటోలు చూస్తుంటే, ఆయన మళ్ళీ గేర్ మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ గమనిస్తే, ఇదివరకున్న స్లిమ్ నెస్ మాయమైంది. మళ్ళీ కొంచెం బరువు పెరిగి, బాడీని బల్క్ చేసినట్లు కనిపిస్తున్నారు. భుజాలు వెడల్పుగా, ఒక సాలిడ్ మాస్ అవతార్ లో దర్శనమిస్తున్నారు. ఇంత తక్కువ టైమ్ లో మళ్ళీ ఇలాంటి మేకోవర్ ఎందుకు? అంటే దానికి సమాధానం ఒక్కటే.. ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా కోసమే తారక్ ఈ సాహసం చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో 'కేజీఎఫ్', 'సలార్' చూస్తే అర్థమవుతుంది. ఆయన హీరోలను డార్క్ గా, ఇంటెన్స్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. ఆ లార్జర్ దన్ లైఫ్ కటౌట్ కి తగ్గట్టుగా ఎన్టీఆర్ ను మార్చాలని నీల్ డిసైడ్ అయినట్లున్నారు. ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది మొదట సన్నగా ఆ తరువాత పవర్ఫుల్ గా కనపడతాని టాక్. ఇప్పటికే సగం షూటింగ్ ఫినిష్ అయ్యింది. అంటే స్లిమ్ గా ఉండే పాత్రకు సంబంధించిన సీన్స్ ఫినిష్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఆ స్లిమ్ లుక్ ని పక్కనపెట్టి, మళ్ళీ ఈ రగ్గడ్ లుక్ లోకి ఎన్టీఆర్ ట్రాన్స్ ఫార్మ్ అయ్యారని తెలుస్తోంది.

నిజానికి ఒక సినిమా కోసం బరువు తగ్గడం, వెంటనే మరో సినిమా కోసం బరువు పెరగడం శరీరంపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఎన్టీఆర్ డెడికేషన్ ముందు ఇవేవీ పెద్ద విషయం కాదు. తను నమ్మిన దర్శకుడు, తనకు నచ్చిన కథ దొరికితే అవుట్ పుట్ కోసం ఎంత కష్టమైనా పడతారని ఈ మేకోవర్స్ నిరూపిస్తున్నాయి. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్లను బ్రేక్ చేయాలంటే ఇలాంటి ప్రయోగాలు తప్పవు.