Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌తో హీరో రైటింగ్.. 'డ్రాగన్'పై కొత్త ట్విస్ట్!

ఈ సినిమాకు సంబంధించి బయటకొచ్చిన బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. ‘డ్రాగన్’ చిత్రంలోని మెయిన్ ఎమోషనల్ అండ్ డ్రామా పార్ట్‌ను ప్రశాంత్ నీల్ ఒంటరిగా రాయలేదు.

By:  Madhu Reddy   |   21 May 2026 9:39 AM IST
డైరెక్టర్‌తో హీరో రైటింగ్.. డ్రాగన్పై కొత్త ట్విస్ట్!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’ గ్లింప్స్ తాజాగా విడుదలై వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, ఈ గ్లింప్స్ హడావిడి పక్కన పెడితే.. సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ రివీల్ చేశారు. ఈ సినిమా డ్రామా పార్ట్‌ను డైరెక్టర్‌తో కలిసి హీరో ఎన్టీఆర్ స్వయంగా కూర్చొని రాశారట.ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేశభక్తి నేపథ్యంలో భారీ సినిమా:

‘డ్రాగన్’ సినిమా అనగానే ఇదొక పక్కా మాస్, యాక్షన్ ఫిల్మ్ అనుకున్నారంతా. కానీ, ప్రశాంత్ నీల్ మాత్రం ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాట్రియాటిక్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు విడుదలైన టీజర్ కేవలం ఒక శాంపిల్ మాత్రమేనని, అసలు సినిమాలోని డ్రామా చాలా భారీ స్థాయిలో ఉంటుందని నీల్ క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే డార్కెస్ట్ క్యారెక్టర్:

తన కెరీర్‌లో ఇప్పటివరకు రాసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ రోల్ చాలా డార్కెస్ట్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఇక ఈ పవర్‌ఫుల్ రోల్ కోసం ఎన్టీఆర్ చాలా బరువు తగ్గాల్సి వచ్చిందట. ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసమే ఏకంగా నాలుగు నెలల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ వెయిట్ చేశారంటే ఈ క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

క్రేజీ ట్విస్ట్.. కథలో ఎన్టీఆర్ వేలు:

ఈ సినిమాకు సంబంధించి బయటకొచ్చిన బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. ‘డ్రాగన్’ చిత్రంలోని మెయిన్ ఎమోషనల్ అండ్ డ్రామా పార్ట్‌ను ప్రశాంత్ నీల్ ఒంటరిగా రాయలేదు. ఇక హీరో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ కలిసి ఈ డ్రామా భాగాన్ని డెవలప్ చేశారట. ఇక ఎన్టీఆర్‌కు కథలపై, స్క్రీన్‌ప్లేపై ఉన్న గ్రిప్ ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని, ఇద్దరం కలిసే ఈ సీన్స్ రాసుకున్నామని డైరెక్టర్ స్వయంగా ఒప్పుకున్నారు.

నో క్రాస్‌ఓవర్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్:

ఇక చాలామంది ఈ సినిమా ‘కేజీఎఫ్’ లేదా ‘సలార్’ యూనివర్స్‌తో లింక్ అయి ఉంటుందేమో అని ఆశపడ్డారు. కానీ నీల్ దీనిపై గట్టి షాక్ ఇచ్చారు. తనకు క్రాస్‌ఓవర్స్ చేయడం అస్సలు ఇష్టం ఉండదని, ‘డ్రాగన్’కు ఏ సినిమాతోనూ కనెక్షన్ లేదని తేల్చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరకు పూర్తి చేసి.. జూన్ 11, 2027న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.

డైరెక్టర్‌తో పాటు హీరో కూడా రైటింగ్‌లో భాగస్వామి అయ్యాడంటేనే ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా రెడీ అయిందో ఊహించుకోవచ్చు. ఒకవైపు దేశభక్తి బ్యాక్‌డ్రాప్, మరోవైపు ఎన్టీఆర్ రాసిన డ్రామా, ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్.. ఇవన్నీ చూస్తుంటే ‘డ్రాగన్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు తిరగరాయబోతుందో చూడాలి.