డ్రాగన్ రచ్చ.. ఫ్యాన్స్ కు మినీ సినిమా కిక్
ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ థియేటర్లలో కూడా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. యూట్యూబ్ లోనే కాదు, బిగ్ స్క్రీన్ మీద ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
By: M Prashanth | 20 May 2026 10:49 AM ISTఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ థియేటర్లలో కూడా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. యూట్యూబ్ లోనే కాదు, బిగ్ స్క్రీన్ మీద ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేవలం ఒక చిన్న వీడియోను వదిలేయకుండా ప్రేక్షకులకు ఏకంగా ఒక మినీ సినిమాను చూపించి సర్ ప్రైజ్ చేశాడు. నిన్న రాత్రి నుంచి ఎక్కడ చూసినా ఈ థియేట్రికల్ రెస్పాన్స్ గురించి సోషల్ మీడియాలో హడావుడి కనిపిస్తోంది.
నాలుగు నిమిషాల ఇరవై తొమ్మిది సెకన్ల పాటు సాగిన ఈ కట్ బిగ్ స్క్రీన్ మీద ఒక రేంజ్ లో పేలింది. మొబైల్ స్క్రీన్ మీద చూడటం వేరు, డాల్బీ సౌండ్ సిస్టమ్ లో రవి బస్రూర్ బీజీఎమ్ వింటూ థియేటర్లో ఆ ఇంటర్నేషనల్ మాఫియా ప్రపంచాన్ని చూడటం వేరు. లుగర్ గా తారక్ ఎంట్రీ ఇచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో కాగితాలు ఎగరేస్తూ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సెలబ్రేషన్స్ తాలూకు వీడియోలు నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతున్నాయి.
సాధారణంగా హీరో పుట్టినరోజుకి ముప్పై సెకన్ల టీజర్ వదులుతారు. కానీ నీల్ ఏకంగా సినిమా ప్లాట్ మొత్తాన్ని ముందే చెప్పేసి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు. ఈ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చూస్తుంటే డ్రాగన్ సినిమాలోని మొదటి ఐదు నిమిషాలు థియేటర్లో చూసిన ఫీలింగ్ కలుగుతోంది. ఒక కథను ముందే ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో, ఆ బ్యాక్ డ్రాప్ కు హీరో ఎలివేషన్ ఎలా కనెక్ట్ చేయాలో నీల్ కు ఉన్న క్లారిటీ ఈ గ్లింప్స్ తో మరోసారి ప్రూవ్ అయింది.
ఈ సాలిడ్ రెస్పాన్స్ చూశాక మేకర్స్ మరో ప్లాన్ కూడా చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానున్న పెద్ద సినిమాల షోలు పడేముందు ఈ గ్లింప్స్ ను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ డార్క్ థీమ్ మరింత స్ట్రాంగ్ గా రీచ్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ థియేటర్లో చూస్తే కిక్ మామూలుగా ఉండదు అని చెప్పవచ్చు.
తారక్ సరికొత్త స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్ స్క్రీన్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. శవాల గుట్టల మధ్య లుగర్ కనిపించగానే ఆడియన్స్ కు పూనకాలు వచ్చేశాయి. నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు అంటూ ఎన్టీఆర్ కోల్డ్ బ్లడెడ్ గా చెప్పిన డైలాగ్ థియేటర్లలో మార్మోగిపోతోంది. ఆ ఒక్క మాటతో లుగర్ సైకాలజీ ఏంటో జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. సినిమా రిలీజ్ కి ఏడాది ముందే ఇలాంటి థియేట్రికల్ ట్రీట్ ఇవ్వడం నిజంగా ఒక అద్భుతమైన ప్రమోషనల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వేసిన ఈ అడుగుతో ప్రాజెక్ట్ మీద ఆసక్తి పీక్స్ కి చేరుకుంది. ఇక నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.
