Begin typing your search above and press return to search.

అనుమానాలు రేకెత్తిస్తున్న ఎన్టీఆర్ కొత్త లుక్.. దేవర 2 సాధ్యమేనా?

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

By:  Madhu Reddy   |   24 Sept 2025 10:45 AM IST
అనుమానాలు రేకెత్తిస్తున్న ఎన్టీఆర్ కొత్త లుక్.. దేవర 2 సాధ్యమేనా?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా చిత్రం దేవర. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. సైలెంట్ గా 600 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత దేవర 2 కి పెద్దగా స్కోప్ లేకపోయినా సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ అది పట్టాలెక్కలేదు. మరొకవైపు ఎన్టీఆర్ బాలీవుడ్లో తొలి సినీ రంగ ప్రవేశం చేస్తూ చేసిన చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో బాలీవుడ్ కి వెళ్లి బొక్క బోర్ల పడ్డారు ఎన్టీఆర్ అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఆయన చాలా బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ చూసిన వారికి కంత్రి సినిమాలో లాగా ఉందని కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది ఈ లుక్ తో దేవర 2 సాధ్యమవుతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. దేవర సినిమాలో చాలా బొద్దుగా కనిపించారు ఎన్టీఆర్. ఆ సమయంలో ఆయన కొంచెం బరువు కూడా పెరిగారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ కోసం మళ్లీ సన్నబడ్డారు. దేవర 2కి మళ్లీ బరువు పెరగాల్సి ఉంటుంది. ఇప్పుడున్న లుక్ తో దేవర 2 తీయడం అసాధ్యం అంటూ అభిమానులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలే దేవర 2 ఉంటుందా? లేదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ.. ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా దేవర 2 సినిమాపై డైరెక్టర్ కొరటాల శివ మళ్లీ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు..

ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పైగా మార్చి నెలలో ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్లో భాగమయ్యారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర 2 లో నటిస్తారా లేక మరో కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ మాత్రం అందరిలో పలు అనుమానాలు క్రియేట్ చేస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.