Begin typing your search above and press return to search.

దేవర 2.. నిర్మాత క్లారిటీ ఇచ్చినా తీరని సందేహాలు!

అసలు విషయానికొస్తే.. లేటెస్ట్ గా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత సుధాకర్ మిక్కిలినేని 'దేవర 2' పై ఒక క్లారిటీ ఇచ్చారు.

By:  M Prashanth   |   27 Jan 2026 6:00 PM IST
దేవర 2.. నిర్మాత క్లారిటీ ఇచ్చినా తీరని సందేహాలు!
X

​మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒకటే టెన్షన్. రెండేళ్ల క్రితం సముద్ర వేటతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన 'దేవర' సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనే సస్పెన్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు ఈ సినిమా అటకెక్కిందని అంటే, మరికొందరు వర్క్ జరుగుతోందని చెబుతున్నారు. ఈ గందరగోళం మధ్య తాజాగా ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.

​ప్రస్తుతం ఎన్టీఆర్ తన మార్కెట్ రేంజ్ ని పాన్ ఇండియా లెవల్లో పెంచుకునే పనిలో ఉన్నారు. గతేడాది విడుదలైన 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో తారక్ ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామాపైనే ప్రస్తుతం పూర్తి ఫోకస్ పెట్టారు. ఆ సినిమా పనులు పూర్తి కాకుండా మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఉద్దేశం తారక్ కు లేదని తెలుస్తోంది.

​అసలు విషయానికొస్తే.. లేటెస్ట్ గా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత సుధాకర్ మిక్కిలినేని 'దేవర 2' పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ 2026 మే నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు, 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లూ ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు కొంత వరకు చెక్ పడింది. మళ్ళీ దేవర 2 ట్రెండింగ్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

​నిర్మాత క్లారిటీ ఇచ్చినా ఇంకా కొన్ని డౌట్స్ అలాగే ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు. పార్ట్ 1 లో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుతూ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్‌ను రీషేప్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ వంద శాతం సంతృప్తి చెందితేనే ముందుకు వెళ్తారని సమాచారం. అందుకే కొరటాల ప్రస్తుతం స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

​నేటి జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడూ లార్జర్ దన్ లైఫ్ విజువల్స్ కోరుకుంటారు. పార్ట్ 1 ఇచ్చిన హైప్‌ను మ్యాచ్ చేయాలంటే పార్ట్ 2 లో అంతకు మించిన కంటెంట్ ఉండాల్సిందే. అసలు మిక్స్ డ్ టాక్ హై రేంజ్ లో వచ్చింది. ఆ సినిమాను కొరటాల మేకింగ్ కంటే అనిరుద్ మ్యూజిక్, ఎన్టీఆర్ క్రేజ్ కాపడినట్లు కూడా ఓ వర్గం వారి నుంచి అభిప్రాయలు వచ్చాయి. ఒకవేళ సెట్టయితే సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఎన్టీఆర్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించాల్సిన బాధ్యత కొరటాలపై ఉంది.

స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం అవ్వడం వల్లే షూటింగ్ డేట్స్ లో మార్పులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ​ఏదేమైనా 'దేవర 2' ఆగిపోలేదని, కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందని అర్థమవుతోంది. నిర్మాత ఇచ్చిన ఈ అప్‌డేట్ తో మళ్ళీ ఆశలు చిగురించాయి. మరి కొరటాల శివ తన టీంతో కలిసి ఎన్టీఆర్‌ను మెప్పించేలా ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి. ఫైనల్ గా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాని ఈ ప్రాజెక్ట్ పై పూర్తి స్పష్టత రాదు. ఏం జరుగుతుందో చూడాలి.