Begin typing your search above and press return to search.

'రాకా' తర్వాత అట్లీ మళ్లీ తెలుగులోనే..!

కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ జవాన్‌తో పాన్‌ ఇండియా స్టార్‌ దర్శకుడిగా మారి పోయాడు. అంతకు ముందు విజయ్‌తో అట్లీ తెరకెక్కించిన బిజిల్‌, మెర్సల్‌, తేరి సినిమాలు ఏ స్థాయిలో హిట్‌ అయ్యాయో తెలిసిందే.

By:  Ramesh Palla   |   6 July 2026 4:00 PM IST
రాకా తర్వాత అట్లీ మళ్లీ తెలుగులోనే..!
X

కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ జవాన్‌తో పాన్‌ ఇండియా స్టార్‌ దర్శకుడిగా మారి పోయాడు. అంతకు ముందు విజయ్‌తో అట్లీ తెరకెక్కించిన బిజిల్‌, మెర్సల్‌, తేరి సినిమాలు ఏ స్థాయిలో హిట్‌ అయ్యాయో తెలిసిందే. అందుకే అట్లీ నుంచి వస్తున్న సినిమా అనగానే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. జవాన్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు అట్లీ ప్రస్తుతం తెలుగు టాప్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌తో 'రాకా' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు మాత్రమే కాకుండా మీడియా వర్గాల వారు, ఇండస్ట్రీకి చెందిన వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. 'రాకా' నుంచి వచ్చిన పోస్టర్‌, గ్లిమ్స్‌తో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. వచ్చే ఏడాది చివరికి రాకా సినిమా రావడం ఖాయం అని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

అల్లు అర్జున్‌ రాకా సినిమా కోసం...

రాకా సినిమా రిలీజ్‌ తర్వాత అట్లీ తన కొత్త సినిమాను ప్రారంభిస్తాడు. అప్పటి వరకు అట్లీ తన కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయడు. కానీ ఆయన తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. 2028 ఆరంభంలోనే అట్లీ కొత్త సినిమా పట్టాలు ఎక్కే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. అట్లీ టీం అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తూ ఉంటుందట. అట్లీ రాకా సినిమా విషయమై సీరియస్‌గా ఉన్నప్పటికీ భవిష్యత్తు సినిమాలపైనా కొంత దృష్టి పెడతాడని అంటున్నారు. అందులో భాగంగానే జవాన్‌ 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ చర్చలు అప్పుడప్పుడు జరుపుతున్నాడని సమాచారం అందుతోంది. అంతే కాకుండా కమల్‌ హాసన్‌, సల్మాన్‌ ఖాన్‌తో ఒక సినిమాను చేయాలనే ఉద్దేశంతో స్టోరీ లైన్ ను రెడీ చేసుకున్నాడట. ఆ స్క్రిప్ట్‌ పూర్తి చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

రాకా సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కోసం.

అట్లీ 'రాకా' షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేయనున్నాడని సమాచారం అందుతోంది. దాదాపు పది నెలల పాటు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే అట్లీ రాకా షూటింగ్‌ పూర్తి చేసి ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అట్లీ గతంలో ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. రాకా సెట్‌ కాకుంటే ఎన్టీఆర్‌తో సినిమాను అట్లీ కన్ఫర్మ్‌ చేసుకునే వాడు అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్‌తో అట్లీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డ్రాగన్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా విషయంలో క్లారిటీ రాలేదు. కానీ ఎన్టీఆర్‌, అట్లీ కాంబోలో మూవీ ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2028 లో అట్లీ, ఎన్టీఆర్‌ కాంబోలో మూవీ పట్టాలెక్కి రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌, అట్లీ కాంబోలో మూవీ...

అల్లు అర్జున్‌తో రూపొందిస్తున్న 'రాకా' సినిమా సూపర్‌ హిట్‌ అయితే కచ్చితంగా అట్లీతో వర్క్ చేసేందుకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అంతా కూడా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌తో అట్లీ ఒక సినిమా అనుకున్నాడు కనుక మరే హీరోతో కమిట్‌ కాకుండా ఎన్టీఆర్‌తోనే సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. కానీ అట్లీ నుంచి చిన్న క్లూ కూడా ఈ విషయమై రావడం లేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం కేవలం పుకార్లే అని అట్లీ టీం కొట్టి పారేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం ఈ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నారు. నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అంటున్నారు. మరి ఈ విషయం గురించి అట్లీ లేదా ఎన్టీఆర్‌ స్పష్టత ఇచ్చేనా చూడాలి. ఎన్టీఆర్‌, అట్లీ కాంబో అంటే సహజంగానే పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు పెరుగుతాయి. కనుక ఈ కాంబో ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాకా తర్వాత అట్లీ మళ్లీ తెలుగు సినిమా చేసే అవకాశం ఉందా అనేది కాలమే నిర్ణయించాలి.