నవంబర్ ఆ ముగ్గురికీ అత్యంత కీలకం!
సక్సెస్ ఇచ్చే కిక్ వేరే లేవల్లో ఉంటుంది. కానీ ఆ కిక్ లో మజా అంత సులభం కాదు. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలి.
By: Srikanth Kontham | 3 Nov 2025 11:00 PM ISTసక్సెస్ ఇచ్చే కిక్ వేరే లేవల్లో ఉంటుంది. కానీ ఆ కిక్ లో మజా అంత సులభం కాదు. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలి. ఎంత మంచి సబ్జెక్ట్ చేసినా కొన్నిసార్లు వైఫల్యాలు తప్పవు. ఆవగింజంత అదృష్టం కూడా తోడైతేనే? కిక్ లో మజా సాద్యమవుతుంది. అలాంటి మజా కోసం ముగ్గురు హీరోలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ లో ఆ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన `జఠాధర` ఈనెల 7న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు.
కష్టానికి తగ్గ ఫలితం కోసం:
సుదీర్ బాబు చాలా కాలంగా కష్టపడుతున్నా? సరైన ఫలితాలు రాని సంగతి తెలిసిందే. శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నా? అది వృద్దా ప్రయత్నంగానే మిగిలిపోతుంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు మౌల్డ్ అవుతున్నా? ఫలితాలు మాత్రం తారు మారు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో `జఠాధర`పై చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు. వైఫల్యాలు తనని ఎంతగా బాధిస్తున్నాయి? అన్నది ఇటీవల ఆయన మాటల్లో బయట పడింది. `జఠాధర`పై మాత్రం బజ్ బాగానే ఉంది. ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో `జఠాదర`తో హిట్ అందుకుంటాడనే అంచనాలు బలపడుతున్నాయి. ఈ సినిమా విజయం కూడా సుధీర్ బాబుకు కీలకమైంది.
కొత్త జానర్ తో నయా స్టార్:
అలాగే అల్లరి నరేష్ కొంత కాలంగా స్టైల్ మార్చి సినిమాలు చేస్తున్నా? ఫలితాలు ఆశించిన విధంగా రావడం లేదు. తనలో కామెడీని పక్కన బెట్టి కొత్తగా ప్రయత్నిస్తున్నా? ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో `12 ఏ రైల్వే కాలనీ` అనే చిత్రంతో ఈనెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. హారర్ థ్రిల్లర్ జానర్ చిత్రమిది. ఇంత వరకూ ఈ జానర్ లో నరేష్ సినిమాలు చేయలేదు. తన స్టైల్ కి భిన్నమైన చిత్రమిది. ఈ మధ్య కాలంలో ఈ జానర్ చిత్రాలు సక్సెస్ అవుతున్న నేపథ్యంలో నరేష్ హిట్ కొడతాడు? అన్న అంచనాలు బలంగా ఉన్నాయి.
మరో మాస్ హిట్ పడుతుందా:
అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని `స్కంద`, `డబుల్ ఇస్మార్ట్` తో వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. అతడు నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` ఈనెల 28న రిలీజ్ అవుతుంది. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో మాస్ హిట్ అందుకుంటాడనే అంచనాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి. ప్రచార చిత్రాలతోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయమంటున్నారు.
