రష్మికతో సుధీర్ ఫైట్.. నెల చివర్లో రామ్ లవ్ ట్రీట్..?
ఈ రెండు సినిమాలతో పాటు తిరువీర్ నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే ముఖ్య లక్ష్యంగా ఈ సినిమా వస్తుంది.
By: Ramesh Boddu | 1 Nov 2025 1:41 PM ISTకొత్త నెల వచ్చేసింది.. కొత్త వీకెండ్ సరికొత్త సినిమాల ట్రీట్ ఉండబోతుంది. అక్టోబర్ లో దసరా నుంచి దీపావళి ట్రీట్ గా సినిమాలు రిలీజ్ కాగా అంచనాలకు తగిన సినిమాలు కొన్ని వాటిని అందుకోలేని సినిమాలు మరికొన్ని వచ్చాయి. ఇక థియేటర్ లో లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర వచ్చింది. ఈ నెల కూడా సినిమాల పండగ షురూ అయ్యేలా ఉంది. కాకపోతే పెద్ద స్టార్ సినిమాలు ఏవి ఈ మంత్ రిలీజ్ లేవు. మంత్ మొదట్లో రష్మిక, సుధీర్ సినిమాల ఫైట్ ఉంటుండగా మంత్ ఎండ్ రామ్ సినిమా రేసులో దిగుతుంది.
ఒకేరోజు 3 సినిమాలు రిలీజ్..
నవంబర్ 7న ఒకేరోజు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. చిలసౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. రష్మిక తో దీక్షిత్ శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా రష్మిక క్రేజ్ తో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.
ఇక అదే రోజు సుధీర్ బాబు హీరోగా వస్తున్న జటాధర రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేశారు. సినిమాలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ లాంటి వాళ్లు నటించారు. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సుధీర్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాధర..
ఈ రెండు సినిమాలతో పాటు తిరువీర్ నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే ముఖ్య లక్ష్యంగా ఈ సినిమా వస్తుంది. నవంబర్ 7న ఈ 3 సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది. ఐతే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, జటాధర లతో పోలిస్తే తిరువీర్ సినిమాకు లో బజ్ ఉంది.
నవంబర్ రెండో వారం 14న దుల్కర్ సల్మాన్ కాంత రిలీజ్ అవుతుంది. రానా నిర్మాతగా దుల్కర్, భాగ్య శ్రీ బోర్స్ కలిసి నటించిన ఈ సినిమా కూడా ఆడియన్స్ లో మంచి బజ్ సంపాధించుకుంది. ఈ సినిమాతో చాందిని చౌదరి నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా వస్తుంది. ఐతే దుల్కర్ ఆల్రెడీ తెలుగులో వరుస హిట్లు కొడుతున్నాడు కాబట్టి కాంత సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐతే కాంత రిలీజ్ రెండు వారాల్లో ఉన్నా ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. రానా ఈ ప్రమోషన్స్ ని కొత్తగా ప్లాన్ చేస్తున్నారని టాక్.
రామ్, భాగ్య శ్రీ బోర్స్ ఆంధ్రా కింగ్ తాలూకా..
నవంబర్ చివరి వారం అంటే 29న రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ ఒకరోజు ముందుకొస్తుందని టాక్. రామ్, భాగ్య శ్రీ బోర్స్ జంటగా నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా లవ్ స్టోరీతో పాటు ప్రతి ఫ్యాన్ తనని తాను రిప్రెజంట్ చేసుకునేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నుంచి వస్తున్న సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి వైబ్ క్రియేట్ చేశాయి. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసం రాం లిరిసిస్ట్ గా కూడా మారాడు. మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
నవంబర్ లో రాబోతున్న సినిమాలన్నీ కూడా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకంగా అనిపించేలా ఉన్నాయి. సో టైటిల్ లో చెప్పినట్టుగానే రష్మికతో సుధీర్ బాక్సాఫీస్ ఫైట్ తో పాటుగా నెల ఆఖరున రామ్ ఇచ్చే లవ్ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.
