నవంబర్ లో నెగ్గేదెవరు?
అయితే వీటిలో టాలీవుడ్ లో ప్రతీ వారం ఓ క్రేజీ సినిమా ఉంది. ఇప్పటికే ఆయా సినిమాల నుంచి రిలీజైన కంటెంట్ సినిమాలపై అంచనాలను కూడా పెంచాయి.
By: Sravani Lakshmi Srungarapu | 24 Oct 2025 11:01 AM ISTఈ ఇయర్ సెప్టెంబర్ లో టాలీవుడ్ నుంచి పలు బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. తేజ సజ్జ మిరాయ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి, మౌళి లిటిల్ హార్ట్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలు బాక్సాఫీస్ ను కళకళలాడించాయి. ఇక అక్టోబర్ విషయానికొస్తే ఈ నెలలో పలు సినిమాలు రిలీజైనప్పటికీ గత నెల లాగా బ్లాక్ బస్టర్లు అందుకుని యునానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న సినిమాలు మాత్రం పెద్దగా లేవు. ఉన్నంతలో డ్యూడ్, కె ర్యాంప్ ఆడియన్స్ ను అలరించాయి. అక్టోబర్ 31న రవితేజ మాస్ జాతరతో అక్టోబర్ పూర్తి కానుంది.
మరో వారం రోజుల్లో నవంబర్ నెలలో అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా నవంబర్ నెలలో బాక్సాఫీస్ కాస్త డల్ గానే ఉంటుంది. అందుకే భారీ సినిమాలను నవంబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపరు. నవంబర్ తర్వాత వచ్చే డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్, ఆ తర్వాత జనవరిలో వచ్చే సంక్రాంతి సీజన్లపై పెద్ద సినిమాల చూపు ఉంటుంది.
పెద్ద సినిమాల తాకిడి లేకుండా ఫ్రీ గా ఉంటుంది కాబట్టి పలు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు నవంబర్ లో రిలీజై తమ లక్ ను టెస్ట్ చేసుకుంటుంటాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ లో కొన్ని తెలుగు సినిమాలతో పాటూ పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. మరి నవంబర్ లో ఏ వారం ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయో చూద్దాం.
నవంబర్ 7న..
రష్మిక మందన్నా హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా కలిసి నటించిన జటాధర మూవీ
ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ జంటగా నటించిన హాక్
ప్రిడేటర్: బ్యాడ్‌లాండ్స్ అనే హాలీవుడ్ సినిమా
నవంబర్ 14న..
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కాంతా మూవీ
బిందూ చంద్రమౌళి, చాందినీ చౌదరి, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ లో నటించిన సంతాన ప్రాప్తిరస్తు
అజయ్ దేవగన్, మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ ల దే దే ప్యార్ దే2
నవంబర్ 21న..
ఫర్హాన్ అక్తర్, అమితాబ్ బచ్చన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 120 బహదూర్
విక్‌డ్2 అనే ఇంగ్లీష్ సినిమా
నవంబర్ 28న..
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కిన ఆంధ్రా కింగ్ తాలూకా
ధనుష్, కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మేన్
జూటోపియా2 అనే హాలీవుడ్ మూవీ
అయితే వీటిలో టాలీవుడ్ లో ప్రతీ వారం ఓ క్రేజీ సినిమా ఉంది. ఇప్పటికే ఆయా సినిమాల నుంచి రిలీజైన కంటెంట్ సినిమాలపై అంచనాలను కూడా పెంచాయి. మరి ఈ నేపథ్యంలో నవంబర్ లో ఏయే సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తాయో చూడాలి.
