Begin typing your search above and press return to search.

వారణాసిలో AI వాడారా.. రాజమౌళి ఏమన్నారంటే..

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి' టీజర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   4 Feb 2026 10:19 AM IST
వారణాసిలో AI వాడారా.. రాజమౌళి ఏమన్నారంటే..
X

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి' టీజర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ స్థాయి విజువల్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అయితే ఈ టీజర్ లోని గ్రాండియర్ చూసి చాలా మంది ఇది జెనరేటివ్ AI తో క్రియేట్ చేసిందేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవడంలో జక్కన్న ఎప్పుడూ ముందు ఉంటారు కాబట్టి ఈ రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి.

ఈ అనుమానాలపై రాజమౌళి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ గా స్పందించారు. ఈ టీజర్ కోసం తన ఆర్టిస్టులు ఎంత కష్టపడ్డారో వివరిస్తూ.. దీన్ని ఏఐ వర్క్ అనడం వాళ్ల టాలెంట్‌ను అవమానించడమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ లో మొదలైన ఈ టీజర్ వర్క్ రిలీజ్ అయ్యే వరకు నాన్ స్టాప్ గా కొనసాగిందట. ముఖ్యంగా టీజర్ లోని ఒక్కో ఫ్రేమ్‌ని రెడీ చేయడానికి ఏకంగా 20 గంటల సమయం పట్టిందని రాజమౌళి రివీల్ చేశారు. ఆ ఆర్టిస్టుల రాత్రింబవళ్ల కష్టమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన విజువల్స్ అని ఆయన చెప్పుకొచ్చారు.

అతి తక్కువ సమయంలోనే కోట్లలో వ్యూస్ సాధించిన ఈ టీజర్ చూస్తే, రాజమౌళి తన టీమ్ మీద పెట్టిన నమ్మకం ఏంటో అర్థమవుతుంది. ఏఐ తో పని పూర్తి చేయడం ఈజీనే కావచ్చు కానీ, హ్యుమాన్ ఎమోషన్ తో కూడిన పర్ఫెక్షన్ రావాలంటే మాత్రం ఆర్టిస్టుల కష్టం ఉండాల్సిందేనని జక్కన్న తెలిపారు. టీజర్ లోని అంటార్కిటికా మంచు కొండలు, రామాయణ కాలం నాటి ఘట్టాలను చూస్తే ఆ డీటెయిలింగ్ ఎంత పక్కాగా ఉందో తెలుస్తుంది. దీనికోసమే ఆయన IMAX ఫార్మాట్‌ను ఎంచుకున్నారు.

టెక్నాలజీని వాడటం తప్పు కాదు కానీ, మనుషుల శ్రమతో వచ్చే అవుట్‌పుట్‌కు ఉన్న వాల్యూ వేరు అని రాజమౌళి మాటలను బట్టి స్పష్టమవుతోంది. మహేష్ బాబును 'రుద్ర' అనే డిఫరెంట్ రోల్ లో చూపిస్తూనే, విజువల్ గా ఒక కొత్త లోకాన్ని మన కళ్లముందు ఉంచబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సుమారు 1300 కోట్ల బడ్జెట్ పెడుతున్న తరుణంలో, ప్రతీ ఫ్రేమ్ కూడా క్వాలిటీగా ఉండాలని రాజమౌళి పట్టుదలతో ఉన్నారు. అందుకే టీజర్ లోని ఆ 3 నిమిషాల కంటెంట్ కోసమే ఆర్టిస్టులు నిద్రలేని రాత్రులు గడిపారట.

వారణాసి సినిమా కేవలం ఒక అడ్వెంచర్ మాత్రమే కాదు, అందులో ఉండే ఎమోషన్ కూడా ఈ విజువల్ గ్రాండియర్ వల్ల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఏఐ వల్ల పని స్పీడ్ అవ్వొచ్చు కానీ, రాజమౌళి విజన్‌కు కావాల్సిన ఆ సోల్ మాత్రం హ్యుమాన్ ఆర్టిస్టుల వల్లనే సాధ్యమవుతుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ కూడా ఇందులో భాగం కావడంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం పక్కా అని చెప్పవచ్చు.