Begin typing your search above and press return to search.

నోరా భంగిమ‌ల‌కు మ‌తి చెడిపోవాలంతే!

By:  Sivaji Kontham   |   13 Dec 2025 7:00 AM IST
నోరా భంగిమ‌ల‌కు మ‌తి చెడిపోవాలంతే!
X

బాహుబ‌లి మ‌నోహ‌రిగా ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల హృద‌యాల‌లో స్థిర‌మైన స్థానం సంపాదించింది నోరా ఫ‌తేహి. త‌న‌దైన అందం, డ్యాన్సింగ్ ప్ర‌తిభ‌తో ఈ బ్యూటీ భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. ఇటీవ‌ల పెద్ద‌తెర‌పై అవ‌కాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ‌రుస‌గా బుల్లితెర రియాలిటీ షోల‌తో బిజీ అయిపోయిన నోరా త‌న కెరీర్- లైఫ్ మ్యాట‌ర్స్ లో రాజీ అన్న‌దే లేకుండా నిరంత‌రం ప్ర‌యోగాలు చేస్తోంది.





డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ సెల‌బ్రేష‌న్స్ కోసం నోరా ఫ‌తేహి ఇప్ప‌టి నుంచే ప్రిపేర్ అవుతోంది. ఈ బ్యూటీ కొత్త సంవ‌త్స‌ర పార్టీ నైట్ లో డ్యాన్స్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకునే ప‌నిలో ఉంద‌ని కూడా స‌మాచారం. ఇలాంటి స‌మ‌యంలో చాలా ముందుగానే అస‌లు పార్టీ సాంగ్ ఎలా ఉంటుందో ఆవిష్క‌రించేందుకు సిద్ధ‌మైంది. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో నోరా అదిరిపోయే డిజైన‌ర్ టాప్, థై స్లిట్ దుస్తుల‌లో క‌నిపించ‌గా, త‌న‌తో పాటే గ్రూప్ డ్యాన్స్ చేస్తున్న వ్య‌క్తులంతా బ్లాక్ డిజైన‌ర్ దుస్తుల‌ను ధ‌రించారు.





వేదికపై నాకు ఇష్టమైన కొన్ని క్షణాలు! నా మొత్తం UNTOLD ప్రదర్శనను నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసాను.. చూడండి అంటూ ఫైర్ ఈమోజీల‌ను నోరా షేర్ చేసింది. ప్ర‌స్తుతం నోరా ఫ‌తేహి స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. తాజా గెట‌ప్ లో నోరా హిప్ షేక్ చేస్తూ కెమెరాల‌కు ఇచ్చిన ఫోజులు కూడా వైర‌ల్ అవుతున్నాయి. టోన్డ్ ఫిజిక్ తో నోరా స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ ప్ర‌ధానంగా హైలైట్ అవుతోంది.





నోరా కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే, థామా అనే సినిమాలో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి కేడి - ది డెవిల్, కాంచ‌న 4 అనే చిత్రాల‌లో న‌టిస్తోంది. ఏడాది క్రితం విడుద‌లైన‌ వెబ్ సిరీస్ `ది రాయల్స్‌`లో తన అద్భుత‌ నటనకు నోరా ప్రశంసలు అందుకుంది.