Begin typing your search above and press return to search.

ఘాటు ప్ర‌ద‌ర్శ‌న‌.. విమర్శల నుంచి ఎస్కేప్ అయ్యేందుకే

నేటి సినీ పరిశ్రమలో గ్లామర్ హంగులు అద్దడంలో నోరా ఫతేహి ఒక బ్రాండ్‌లా మారిపోయారు.

By:  Sivaji Kontham   |   25 April 2026 9:00 AM IST
ఘాటు ప్ర‌ద‌ర్శ‌న‌.. విమర్శల నుంచి ఎస్కేప్ అయ్యేందుకే
X

నేటి సినీ పరిశ్రమలో గ్లామర్ హంగులు అద్దడంలో నోరా ఫతేహి ఒక బ్రాండ్‌లా మారిపోయారు. ప్రత్యేక నృత్య ప్రదర్శనలు లేదా ఐటెమ్ సాంగ్స్ తో బాక్సాఫీస్ వద్ద అటెన్షన్ సంపాదించడంలో ఆమె స్టైలే వేరు. అయితే తాజాగా నోరా తన కెరీర్‌లోని సూపర్ హిట్ సాంగ్ `దిల్బర్` షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మేకర్స్ తనను రివీలింగ్ దుస్తులు ధరించమని కోరగా.. తాను నిరాకరించి డ్రెస్ రీ-డిజైన్ చేయించానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్లామర్‌కు.. అసభ్యతకు మధ్య చాలా సన్నని గీత ఉంటుందని, తాను ఎప్పుడూ ఆ హద్దులు దాటాలని అనుకోలేదని నోరా స్పష్టం చేశారు. లుక్ స్టైలిష్‌గా ఉండాలి తప్ప చౌకబారుగా ఉండకూడదన్నదే తన పాలసీ అని ఆమె వెల్లడించారు. అయితే కన్నడ చిత్రం `కేడి- ది డెవిల్`లో నోరా చేసిన ఐటమ్ సాంగ్‌పై గ్లామర్ హద్దులు దాటిందనే విమర్శలు వచ్చాయి. ఆ నెగెటివిటీ నుండి తప్పించుకోవడానికే నోరా ఇప్పుడు పాత ముచ్చట్లు చెబుతూ తన ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్లామర్ హద్దులు దాటాయనే విమర్శలు రాగానే ఇలా `ఎస్కేప్` అవ్వాలని చూసిన వారిలో నోరా ఫతేహి మొదటి వ్యక్తి ఏమీ కాదు. గతంలో సనా ఖాన్, షెర్లిన్ చోప్రా, ఊర్ఫీ జావేద్ వంటి వారు కూడా ఇదే బాటలో నడిచారు. సనా ఖాన్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు గ్లామర్ పాత్రలపై విమర్శలు రాగానే.. ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళి చిత్ర పరిశ్రమకే స్వస్తి చెప్పారు. అలాగే షెర్లిన్ చోప్రా తన బోల్డ్ వీడియోలు, ఫోటో షూట్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ తాను మహిళా సాధికారత కోసమో లేదా వ్యవస్థలోని లోపాలపై పోరాటం కోసమో అలా చేస్తున్నానని వింత వాదనలు తెరపైకి తెచ్చేవారు.

సోషల్ మీడియా సెన్సేషన్ ఊర్ఫీ జావేద్ తన విచిత్రమైన.. అత్యంత రివీలింగ్ దుస్తుల వల్ల నిరంతరం విమర్శల పాలవుతూనే ఉంటారు. అయితే ఆ విమర్శల నుండి తప్పించుకోవడానికి ఆమె `ఫ్యాషన్ ఫ్రీడమ్` అనే ముసుగును వాడుకుంటూ ఉంటారు. వీరంతా ఒకవైపు గ్లామర్ ఇమేజ్‌తో పాపులారిటీ సంపాదిస్తూనే.. విమర్శలు ఎదురైనప్పుడు మాత్రం ఒక రకమైన క్టిమ్ కార్డ్ లేదా నీతి సూత్రాల వెనుక దాక్కునే ప్రయత్నం చేస్తారనేది విమర్శకుల ప్రధాన ఆరోపణ. నోరా ఫతేహి ఇప్పుడు `దిల్బర్` సాంగ్ గురించి చెబుతున్న విషయాలు కూడా ఆ కోవకు చెందినవేనని నెటిజన్లు భావిస్తున్నారు.

బాక్సాఫీస్ విజయం కోసం గ్లామర్ పేరిట అసభ్యతను ప్రోత్సహిస్తున్నారా అనే చర్చ నోరా వ్యాఖ్యలతో మరోసారి ఊపందుకుంది. కేవలం శరీర ప్రదర్శనతోనే ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో మేకర్స్ .. నటీమణులు కేవలం విమర్శలు వచ్చినప్పుడు సమర్థించుకోవడం కాకుండా.. మొదటి నుండే హుందాతనాన్ని పాటిస్తే ఈ `ఎస్కేప్` అవ్వాల్సిన అవసరం ఉండదు. గ్లామర్- ప్రెజెంటేషన్ చుట్టూ జరుగుతున్న ఈ చర్చ సినిమా ఇండస్ట్రీలో మునుముందు ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.